వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. ఎవరైనా మంచి పని చేస్తే అది చూసి ప్రశంసించే పెద్ద మనసు నీకు లేదు చంద్రబాబు అంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి.


చంద్రబబు నిరుద్యోగ భృతి అంటూ యువతని సోమరిపోతులను చేసినట్టు, ఆ వెయ్యి రూపాయితో స్మార్ట్ ఫోన్ కొని ఆవారాగా తిరగకండి అని యువతను హెచ్చరించిన నారా లోకేష్ లా కాకుండా ... మేము యువతకు ఉద్యోగం కల్పించినందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు చంద్రబాబు అని అన్నారు విజయసాయి రెడ్డి.


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''గ్రామ సచివాలయాలు,వలంటీర్ల వ్యవస్థ కోసం 4 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు లేదు. రిక్షాలు తొక్కాలని, హమాలీ పని చేయాలి అంటూ నిరుద్యోగులను బెదరగొట్టిన పాపం ఊరికే పోదు చంద్రబబు నాయుడు గారూ. ఈ ఐదేళ్లలో ఇంకా చాలా చూస్తారు. గుండె రాయి చేసుకోండి.'' అంటూ నారా లోకేష్ కి ట్యాగ్ చేసి ట్విట్టర్ లో ట్విట్ చేశారు విజయసాయి రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: