విశాఖ‌ప‌ట్నం గ్రేట‌ర్ కార్పోరేష‌న్‌పై ఆధికార వైఎస్సార్‌ పార్టీ క‌న్నేసిందా...?  గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పోరేష‌న్‌లో పాగా వేసేందుకు ఇప్ప‌టి నుంచి ఎత్తులు వేస్తుందా..? అందుకు త‌గిన విధంగా వైసీపీ పావులు క‌దుపుతుందా..? గ‌్రేట‌ర్‌లో ఫ్యాన్ గాలి వీచేలా ఇత‌ర పార్టీల నేత‌ల‌కు గాలం వేసిందా..? ఈ గాలానికి ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు చిక్కాడా...? గ‌ంటా రాక‌ను ఆయ‌న మాజీ స్నేహితుడు ప్ర‌స్తుత వైఎస్సార్ సీపీ మంత్రి ఆవంతి శ్రీ‌నివాస్‌రావు అడ్డుకుంటున్నాడా..? అంటే వీట‌న్నికి స‌మాధానం అవున‌నే వ‌స్తుంది. 


విశాఖ గ్రేట‌ర్ మున్సిఫ‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లో రానున్న నేప‌థ్యంలో అక్క‌డ పాగా వేసి మేయ‌ర్ ప‌ద‌విని కైవసం చేసుకునేందుకు అధికార వైసీపీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. విశాఖ గ్రేట‌ర్‌లో పాగా వేయాలంటే అక్క‌డ ఉన్న ప్ర‌తిప‌క్ష టీడీపీ కి చెందిన బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీలో చేర్చుకుంటే మేయ‌ర్‌ను సునాయ‌సంగా కైవ‌సం చేసుకోవ‌చ్చ‌ని వైసీపి ఆలోచ‌న‌ట‌. అందుకే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి త‌న ఆత్మీయుడైన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డిని రంగంలోకి దించాడ‌ట‌. 


అందుకు విజ‌య‌సాయి రెడ్డి విశాఖ‌లో టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కులుగా ఉన్న‌వారిని పార్టీలో చేర్చుకునేందుకు పావులు క‌దుపుతున్నాడ‌ట‌. విజ‌య‌సాయి రెడ్డి గాలానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్‌రావు చిక్కిన‌ట్లు వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా షికారు చేస్తున్నాయి. అయితే గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీ లో చేరేందుకు దాదాపు మార్గం సుగుమం కాగా దానికి మంత్రి ఆవంతి శ్రీ‌నివాస్‌రావు అడ్డు చెపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. టీడీపీలో గంటా శ్రీ‌నివాసరావు, ఆవంతి శ్రీ‌నివాస్‌రావులు పాత‌కాపులే. ఇద్ద‌రు స్నేహంగా ఉండేవారు. ఇద్ద‌రు ఒకే పార్టీలో ఉన్న‌ప్ప‌టికి ఆవంతి శ్రీ‌నివాస‌రావు ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జ‌గ‌న్ క్యాబినెట్‌లో ప‌నిచేస్తున్నాడు. 


ఇప్పుడు గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీకి వ‌చ్చేందుకు సిద్దం కావ‌డంతో ఆవంతి శ్రీ‌నివాస‌రావు అడ్డుగా ఉన్నాడ‌ట‌. మంత్రిగా గ‌తంలో ప‌నిచేసిన గంటా శ్రీ‌నివాస‌రావు వైసీపీలో చేరితో విశాఖ గ్రేట‌ర్‌లో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌నే ఆలోచ‌న‌ల‌తో ఉన్న పార్టీ నేత‌ల‌కు మంత్రి ఆవంతి శ్రీనివాస‌రావు అభ్యంత‌రం చెప్ప‌డంతో కొంత సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంద‌ట‌.. ఏదేమైనా మంత్రి ఆవంతి గంటా రాక‌కు అభ్యంత‌రం చెప్పినా సీఎం జ‌గ‌న్ త‌లుచుకుంటే గంటారాక‌ను ఎవ‌రు ఆపినా ఆగ‌ద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. సో గంటా వైసీపీలో చేర‌డం ఖాయ‌మైన‌ట్లేన‌న్న మాట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: