ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యుఎ) ప్రతిష్టాత్మక ఐడబ్యూఏ డెవలప్ మెంట్ అవార్డుకు భారతదేశం నుంచి ఐ ఏ ఎస్ అధికారి ఎం. దాన కిషోర్ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈయన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మెట్రోపోలిటన్ నీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల మండలి ( జలమండలి) మ్యానేజింగ్ డైరెక్టర్  గా  వ్యవరిస్తున్నారు. వాటర్ బోర్డు ఎండి గా వృధాగా పోతున్న మంచినీటిని అరికట్టేందుకు వినూత్నమైన చర్యలు చేట్టారు. ఒక విధంగా చెప్పాలంటే మాస్ ఉద్యమాన్ని చేపట్టారనే చెప్పాలి. ఈ క్రమంలో జల నాయకత్వం మరియు జల సంరక్షణ (WaLC) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వాక్ కార్యక్రమం ద్వారా నీటి వథాను తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. దాంతో పాటుగా వృధాగా పోతున్న నీటిని పునర్వినియోగం, బోర్లు రీఛార్జ్ చేయడంపై దృష్టి సారించారు.




ఇందుకు  కాలనీ వాసులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఎన్ జీ లను భాగస్వాములను చెశారు. ఈ క్రమంలో నగర్ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేంచేందుకు కృషి చేశారు. ఈయన కృషి ఫలితంగా వాక్ బృందంలో యువత సంఖ్య అధికంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర్ వ్యాప్తంగా 15 వేల మందితో వాక్ బృందాల ఏర్పాటు లక్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికి ఆరు వేల మందిని సభ్యులుగా నియమించారు. వారంతా స్వచ్చందగా వాక్ ఉద్యమానికి నడుంబిగించారు.  తద్వారా ఒక ప్రత్యేకమైన చొరవ మరియు నీటి సంరక్షణ అంశంపై ప్రజలలో అవగాహాన కల్పిస్తున్నారు.





ఈ  విషయాలను అధ్యాయనం  చేసిన ఐడబ్ల్యుఎ  ఈ అవార్డు నామినేషన్స్ కోసం పంపడం జరిగింది.           సుమారు 130కి పైగా దేశాల నామినేషన్లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్ కు జలమండలి ఎండీ ఎంపికయ్యారు. ఐడబ్యూఏ సెక్రటెరియట్ నుంచి ఎండీని అభినందిస్తూ, అలాగే తుది ప్రజంటేషన్ ను సమర్పించాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఎ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం వాటర్ డెవలప్ మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ శ్రీలంకలోని కొలంబోలో 2019 డిసెంబర్ 1-5 వరకు సస్టైనబుల్ సొల్యూషన్స్ పై జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: