వైసీపీ పాలన మూడు నెలలు అవుతోంది. పాలన ఇపుడిపుడే గాడిలో పడుతోంది. ఈ సమయంలో కొంతమంది మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వంలో పాతిక మంది మంత్రులు ఉంటే కొందరు సైలెంట్ మోడ్ లోకి కూడా వెళ్ళిపోయారు. కొత్త ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు జనాలకు చేరువ చేయాల్సిన బాధ్యత ఎక్కువగా మంత్రులకే ఉంది. అయితే మంత్రుల్లో ఎనభై శాతం ఇనాయిక్టివ్ గా ఉన్నారని జగన్ మార్కులు కూడా వేస్తున్నారు.


ఈ నేపధ్యంలో ఇద్దరు మహిళా మంత్రులు పెద్ద నోరు చేసుకుని సర్కార్ కు అనుకూలంగా డిఫెన్స్ చేయడం విశేషం. గత రెండు మూడు రోజులుగా గిరిజన మంత్రి  పుష్ప శ్రీవాణి చంద్రబాబును ఓ రేంజిలో కడిగేస్తున్నారు. హామీలు ఇవ్వడమే చంద్రబాబుకు తెలుసు. అయితే వాటిని అమలు చేయడం మాత్రం జగన్ కే సాధ్యమని ఆమె చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో  మంట పుట్టిస్తున్నాయి.
మరో మంత్రి తానేటి వనిత సైతం ఇసుకాసురులు టీడీపీ తమ్ముళ్లేనంటూ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారాయి.


ఇసుకను దోచుకున్న టీడీపీ నేతలే ఇపుడు ఇసుక కోసం ఆందోళలను చేస్తూంటే విడ్డూరంగా ఉందని ఆమె భారీ సెటైర్లు వేశారు. వనజాక్షిపై దాడి చేసిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక గురించి ధర్నా చేస్తానంటే జనం నవ్వుతున్నారని ఆమె అనడంతో తమ్ముళ్ళ మొత్తం ఆందోళననే వూదేసినట్లైంది. సెప్టెంబర్ 5 నుంచి మంచి ఇసుక పాలసీని తెస్తామని కూడా తానేటి వనిత చెప్పారు.


ఇక ఇదే రూట్లో మరికొందరు మంత్రులు కూడా రంగంలోకి దిగి సర్కార్ విధానాలను జనాలకు చెప్పడమే కాదు, విపక్షాల అర్ధం పర్ధం లేని విమర్శలను తిప్పికొడుతూంటే తప్పకుండా వైసీపీ సర్కార్ మీద ఎల్లో మీడియా విష ప్రచారానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు. జగన్ ఒక్కడే ప్రభుత్వాన్ని నడపలేరు కదా మంత్రులు కూడా తలా చేయి వేస్తే సర్కార్ పై పాజిటివ్ నెస్ వస్తుందని అంటున్నారు. మరి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: