మనిషి ఎంత వేగంగా పరుగులు తీస్తున్నాడో అతని వెనుక నీడలా ముప్పు తరుముకొస్తునే ఉన్నది.  మనిషి తీసుకుంటున్న నిర్ణయాలు.. బద్దకంతో అనుసరిస్తున్న విధానం.. ప్రకృతిని వాడుకుంటున్న తీరు కూర్చున్న చోటనే గొయ్యి తీసుకుంటున్నట్టుగా మారిపోతున్నది.  ప్రకృతి సమతుల్యం దెబ్బతినడంతో.. అనేక ఇబ్బందులు పడుతున్నారు.  వనరుల వినియోగం గతంలో కంటే విపరీతంగా పరిగిపోయాయి.  కర్బన పదార్ధాలను ఇష్టం వచ్చినట్టుగా గాల్లోకి వదిలేస్తున్నారు.  ఫలితం భూతాపం. భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ఇలా భూమిపై తెలియకుండా వేడి పెరిగిపోతుండటం వినాశనానికి దారి తీస్తున్నది.  


ప్రతి ఏడాది భూమిపై 1.5 డిగ్రీల చొప్పున వేడి పెరుగుతున్నది.  సగటున పెరిగే ఈ వేడి కారణంగా భూమిపై చల్లదనాన్ని ఇస్తున్న మంచు కొండలు కరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి.  ఎప్పుడైతే ఈ మంచు కరిగి సముద్రంలో కలిసిపోతున్నదో అప్పటి నుంచి సముద్రాల్లో నీటిశాతం పెరిగిపోతున్నది.  పైగా సముద్రంలో సమతుల్యాన్ని కూడా పాడుచేస్తున్నారు.  విపరీతంగా మత్యసంపదను హరించి వేస్తున్నారు.  సముద్రాల్లో మత్యసంపద ఇటీవల గణనీయంగా తగ్గిపోతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి.  


ఇదిలా జరిగితే.. సముద్రాల్లో వ్యర్ధ పదార్దాలు కుప్పలుగా పేరుకుపోతాయి.  వీటి సాంద్రత పెరిగితే.. నీరు ఆక్రమించే స్థలం పెరిగిపోతుంది.  మరోవైపు మంచుకొండలు కరిగి సముద్రంలో కలిసిపోతుండటంతో ఎక్కువ స్పేస్ కోసం ఆ నీరు ముందుకు వస్తుంది.  జనావాసాలను ముంచేస్తుంది.  ఇలా సముద్రం ముందుకు దూసుకురావడానికి ఎంతో సమయం లేదు.. మరో 30 సంవత్సరాల్లో ప్రపంచంలోని చాలా నగరాలకు ఈ ముప్పు ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి.  


ఇండియాలోని ముంబై, చెన్నై, చైనాలోని షాంగైతో సహా అనేక తీర ప్రాంత నగరాలు, అమెరికాలోని న్యూయార్క్, మియామి, యూరప్ లోని ఆమ్‌స్టర్‌డామ్‌, వెనిస్‌, హాంబర్గ్‌  వంటి నగరాలకు ముప్పు పొంచి ఉన్నది.  ప్రపంచంలో అత్యధిక కర్బన పదార్ధాలను విడుదల చేస్తున్న వాటిల్లో చైనా మొదటిస్థానంలో ఉన్నది.  అమెరికా, యూరప్, ఇండియాలు సగటున ఎంత కర్బన పదార్ధాలను విడుదల చేస్తున్నాయో వాటికి సమానంగా ఒక్క చైనా ఇలాంటి పదార్ధాలను విడుదల చేస్తుంది.  ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టకపోతే.. ప్రపంచంలో గొప్ప నగరాలు కనుమరుగవ్వడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: