మనిషి ఎక్కడ ఎలా పుట్టాడు అనే దానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.  కానీ ఖచ్చికంగా ఇక్కడి నుంచే మనిషి పరిణామ క్రమం మొదలైంది.. ఇక్కడే మొదటి మనిషి ఆవిర్భాగం జరిగింది అనే విషయాన్ని ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోతున్నారు.  కారణం ఏంటి అనే విషయం గురించి చర్చించాలి అంటే.. పెద్ద గ్రంధమే రాయాల్సి వస్తుంది.  మొదటి మనిషి ఆవిర్భావం ఆఫ్రికా నుంచే ప్రారంభం అయ్యింది అనే దానిపై క్లారిటీ ఉన్నది.  ఖచ్చితమైన ప్లేస్ చెప్పకలేకపోయినా.. కొన్ని ప్రాంతాలను మాత్రం ఇప్పటికే గుర్తించారు.

ఇథియోపియాలోని లూసీ అనే ప్రాంతంలో మొదటి మనిషిగా చెప్పుకుంటున్న పుర్రెను కనుగొన్నారు.  ఇప్పటి వరకు అదే అతి పురాతనమైన పుర్రెగా గుర్తింపు ఉన్నది.  కానీ, ఇటీవలే కొందరు పరిశోధకులు జరిపిన తవ్వకాలలో మరో పుర్రె బయటపడింది.  దీన్ని లూసీకి సమీపంలోనే గుర్తించారు.  ఈ పుర్రె లూసీలో బయటపడ్డ పుర్రె కంటే అతి పురాతనమైనది అని చెప్పి పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి.  


త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  మొదటి మనిషి పరిణామం చెందిన తరువాత ఇప్పటి వరకు ఎన్నో మార్పులు వచ్చాయి.  విజ్ఞానం పెరుగుతూ వచ్చింది.. ఆధునిక మనిషిగా అవతరించిన తరువాత టెక్నాలజీని సృష్టించుకున్నాడు.  టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆకాశానికి ఎదుగుతున్నాడు.  గ్రహాలపై అడుగుపెడుతున్నారు.  ఇలా ఎన్నింటినో కనుగొంటున్న మనిషి.. తన వినాశాన్ని కొనితెచ్చే విషయాలపై మాత్రం అశ్రద్ధ చేస్తున్నాడు.  


మనిషి అనుసరిస్తున్న విధానాలు మనిషి మనుగడను ప్రశ్నర్ధకంగా మారుస్తున్నాయి.  విచ్చలవిడిగా టెక్నాలజీని వినియోగించడంతో పాటు, వాతావరణానికి ముప్పు తీసుకొచ్చే కర్బన పదార్ధాలను విరివిగా వాతావరణంలోకి వదిలేస్తుండటంతో సమతుల్యం దెబ్బతింటోంది. అకాల వర్షాలు, తీవ్రమైన కరువు కాటకాలు వస్తున్నాయి.  ఇది వినాశనానికి హేతువు అని చెప్పాలి.  ఇప్పటికైనా మనిషి చేస్తున్న తప్పును తెలుసుకొని వాటి నుంచి బయటపడితే మంచిది లేదంటే.. ఎక్కడైతే మనిషి పుట్టుక ప్రారంభం అయ్యిందో తిరిగి అక్కడి నుంచే మనిషి అంతం మొదలౌతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: