కోడెల శివప్రసాద్ కు కోర్ట్ దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. బెయిల్ ఇస్తాము కానీ విజయవాడ వదిలి పోవద్దని చెప్పింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయాలనీ ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పోలిసులకు అందుబాటులో ఉండాలని చెప్పింది. వారంలో మూడు రోజులు పోలీసు స్టేషన్  లో సంతకాలు చేయాలని కోర్ట్ పేర్కొంది. అయితే కోర్ట్ .. కోడెలకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్ట్ బెయిల్ ను మంజూరు చేసింది. అయితే కోడెల ఫ్యామిలీ పై వివిధ పోలీస్ స్టేషన్ లలో ఐదు కేసులు నమోదు అయ్యాయి. అయితే కోడెల చెబుతూ నా మీద రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని చెప్పారు.


అయితే ప్రభుత్వం తరపున న్యాయవాది మాట్లాడుతూ 5 ఏళ్ళు ఫర్నిచర్ ను వాడుకొని ఇప్పుడు డబ్బులు కడతామని చెప్పడం చట్ట విరుద్దమని, ప్రభుత్వ ప్రొపెర్టీని స్వంత అవసరాల కోసం వాడుకోవటం చట్ట వ్యతిరేకం అని ప్రభుత్వ న్యాయవాది చెప్పుకొచ్చారు. అయితే మరి కొన్ని కేసుల్లో కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. అయితే టీడీపీ అధికారంలో మళ్ళీ వచ్చి ఉంటే కోడెల మళ్ళీ స్పీకర్ స్థానంలో చేతివాటం ఇంకా ఎక్కువయ్యేది.


అసీంబ్లీ కోసం తెచ్చిన ప్రభుత్వ ఆస్తిని కోడెల శివప్రసాద్ తన స్వంత ప్రయోజనాల కోసం వాడుతున్నారని అధికారులు నిర్ధారణకు రావటంతో పోలీసులు కోడెల అతని కుమారుడి మీద కేసు కూడా నమోదు చేసారు. మాజీ స్పీకర్ అయ్యి ఉండి ఒక దొంగతనం కింద కేసు బుక్ అయ్యిందంటే కోడెల గురించి జనాలు నోరెళ్లబెడుతున్నారు. అయితే గతంలో కోడెల చేసిన అరాచకానికి అద్దు అదుపు లేకుండా పోయింది. ఏకంగా కే టాక్స్ అంటూ ప్రజలను హింసించారు. ప్రజలు ఎన్నికున్న ప్రజా ప్రతినిధులు ఎలా ఉండ కూడదో ఒక్క కోడెల శివప్రసాద్ ను చూపిస్తే సరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: