వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు.  40 ఇయర్స్ అని డబ్బా కొట్టుకునే వాళ్ళు ఒక్కసారైనా ఇలాంటి సాహసోపేతర నిర్ణయం తీసుకున్నారా అంటూ చంద్రబాబు నాయుడు ని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. 


విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ''టీటీడీ, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పనిచేయడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ సెల్ఫ్ డబ్బా వాయించుకునే పెద్ద మనిషి ఇన్నాళ్లు ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోలేదో ప్రజలకు వివరించాలి.'' ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడుని, నారా లోకేష్ కి ట్యాగ్ చేశారు. 


ఈ ట్విట్ కు నెటిజన్లు స్పందిస్తూ ''చాలా చక్కని నిర్ణయం అభినందనీయం, సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళకి ఇలాంటివి చిన్న విషయాలు తెలియవు. జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం అభినందనీయం అమల్లోకి వస్తే చాలా సంతోషం.'' అంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మరికొందరు స్పందిస్తూ 'ఈ నిర్ణయం త్వరగా అమలు అవుతే మంచిది' అని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: