గత  ఎన్నికల్లో  టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా  పరాజయాన్ని ఎదుర్కోంది.ఈ నేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే పార్టీ ని బలోపేతం చేయాలంటే ... పార్టీ పగ్గాలు వేరే వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి పేర్లు ఎక్కువ చర్చనీయంగా మారాయి.ఒకటి జూనియర్ ఎన్టీఆర్ ...పార్టీని బలోపేతం చేయాలంటే  స్టార్ హీరో ..సీనియర్ ఎన్టీఆర్ మనువడు జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీని అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టీడీపీ పార్టీ వ్యవహారకు చాలా దూరంగా ఉంటున్నారు .మొన్న జరిగిన ఎలెక్షన్లలో పార్టీ లో ప్రచారం కి కూడా చాలా దూరంగానే ఉన్నాడు. 


దీంతో  శ్రీ భరత్ పేరు కూడా ఈ లిస్ట్ లో  గట్టిగానే వినిపిస్తుంది . మొన్నటి వరకు ఎవ్వరికి పరిచయం లేని శ్రీ భరత్ ...గత ఎలెక్షన్ లలో టీడీపీ ఎంపీ గా పోటీ చేయటం తో అందరి దృష్టిలో పడ్డాడు .  కాగా తాజాగా శ్రీ భరత్ చేసిన వ్యాఖ్యలతో  ...ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు .శ్రీ భరత్ వ్యాఖ్యలతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు.


ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తో వచ్చిన నాయకులందరూ మొదట ఎవరికీ తెలిసిన వాళ్ళు కాదు.. కానీ  కొత్తవాళ్లు పార్టీని నడిపించారు కదా .. పలానా వ్యక్తి వస్తేనే పార్టీకి బలం అనడం సరికాదంటూ భరత్ వ్యాఖ్యలు శ్రీ భరత్ రాజకీయ పరిణితిని తెలియ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో అతనికే పార్టీ అధికారం కట్ట బెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకవేళ భరత్ పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ సమర్సదవంతంగా నడిపించగలడా ... టీడీపీ అధినేత చంద్ర బాబు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి


మరింత సమాచారం తెలుసుకోండి: