ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించారు. భారత పర్యాటకులు క్యూ కట్టారు. అంతా బాగానే ఉందనుకున్న అకస్మాత్తుగా సమస్య వచ్చిపడింది. ఇంతకి లండన్ అంబేద్కర్ మ్యూజియంకు వచ్చిపడిన సమస్యేంటి, మ్యూజియం మనుగడకే ప్రమాదం ఏర్పడిందా.? భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్ మ్యూజియంపై వివాదం. పొరుగింటి జనం అభ్యంతరంతో మ్యూజియం కొనసాగింపే ప్రశ్నార్ధకం. ఇళ్ల మధ్య మ్యూజియం వద్దంటూ లండన్ ప్రజల పిటిషన్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య లండన్ లో కొంత కాలం ఉన్నారు.



లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతూ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో ప్రైమ్ రోజ్ హిల్ లో నివసించారు. అక్కడ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. సామాజిక న్యాయం కోసం పోరాడిన నేతగా అంబేద్కర్ ప్రశంసలు పొందారు. అంబేద్కర్ మహారాష్ట్ర వాసి కావడంతో లండన్ లో ఆయన నివసించిన ఇంటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. భారత కరెన్సీ ప్రకారం ముప్పై కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో పాటు దానిలో కొన్ని మార్పులు చేసింది. అంబేద్కర్ మ్యూజియంగా మార్చింది. రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో ఈ భవనాన్ని కొనుగోలు చేయగా తన లండన్ పర్యటన సందర్భంగా రెండు వేల పదిహేను నవంబర్ పద్నాలుగు న ప్రధాని మోదీ అక్కడ ఒక మ్యూజియంను ప్రారంభించారు.


అప్పటి నుంచి అంబేద్కర్ మ్యూజియాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో వెళుతున్నారు. వారాంతాల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగానే వుంది. అంబేద్కర్ మ్యూజియంగా పిలుస్తున్న అంబేద్కర్ హౌస్ పై గతేడాది జనవరిలో వివాదం చెలరేగింది. ఆవాస ప్రాంతాల్లో మ్యూజియం వుండకూడదని పొరుగున ఉన్న ఇద్దరు వ్యక్తులు కాంటీన్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేశారు. కామ్రెడ్ కౌన్సిల్ అంటే గ్రేటర్ లండన్ మున్సిపల్ కౌన్సిల్ లో ఒక భాగమని అర్థం. అంబేద్కర్ హౌస్ బిల్డింగ్ ప్లాన్ లో లోపాలున్నాయని కౌన్సిల్ గుర్తించింది. మ్యూజియం నిర్వహణకు అనుమతి తీసుకోకుండా అక్కడ మ్యూజియం నిర్వహిస్తున్నారని కౌన్సిల్ నిర్ధారించింది. వెంటనే మూసివేతకు ఉత్తర్వులిచ్చింది. అయితే ముందస్తు తేదీతో అనుమతులు ఇవ్వాలంటూ బిల్డింగ్ ఓనర్ రెండు వేల పధ్ధెనిమిది ఫిబ్రవరిలో మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.



అంబేద్కర్ ఇంటిని మ్యూజియంగా నడపడానికి కౌన్సిల్ అనుమతి తిరస్కరించటం మీద మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. దీని పై సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ న బహిరంగ విచారణ జరగనుంది. విచారణ నిర్వహించేందుకు కామ్రెడ్ కౌన్సిల్ అంగీకరించింది. దీనితో ఊపిరి పీల్చుకున్న మహారాష్ట్ర సర్కార్ ఇప్పుడు అంతా సవ్యంగానే జరుగుతుందని అంబేద్కర్ అభిమానులకు భరోసా ఇస్తోంది. అంబేద్కర్ నివాసాన్ని కొనుగోలు చేసిన తర్వాత మ్యూజియంగా మార్చేందుకు ఇండియన్ హైకమిషన్ అన్ని చర్యలు తీసుకుందని ఇప్పుడు లండన్ అధికారులను సంప్రదించి మ్యూజియం మూతపడకుండా చూసే బాధ్యతను తీసుకుందని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కార్యాలయం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: