ప్ర‌తి పల్లెటూర్లు లోనూ ప్రజలను నిద్ర లేపేది ఎవరంటే కోడి కోతే. కోడికూత వినని గ్రామం.. అసలు కోడి కనిపించని గ్రామం అంటూ ఉంటుందా ? అని ప్రశ్నించుకుంటే కచ్చితంగా ఉండదు అని అనుకుంటాం. కానీ ఓ గ్రామంలో మాత్రం కోడికూతే కాదు కదా ? అసలు ఒక్క కోడి కూడా ఉండ‌దు. ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోనే ఉంది. ఆ గ్రామంలో కోడి కూర, కోడిగుడ్డు, చివరకు కోడి ఆమ్లెట్ కూడా తినరు. అది ఏంటి అని షాక్ అవుతున్నారా ? అంటే ఈ ఆసక్తికరమైన కథ తెలుసుకోవాల్సిందే.


తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మండలం కంచిరావుపల్లి తండాలో కోడికూత వినపడదు. ఆ గ్రామంలో కనీసం చూసేందుకు అయినా ఒక కోడిపిల్ల కూడా కనిపించదు. తండావాసులు ఎన్నో ఏళ్ల నుంచి తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలు ఇంకా పాటిస్తున్నారు. ఈ తండాలో మొత్తం 80 కుటుంబాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ తమకు గురూజీ అయిన సోమ‌సాధ్ గురూజీ మాటకు కట్టుబడి వీరంతా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ గ్రామస్తులు కనీసం కోడి కూర‌ తినటం కాదు కదా క‌నీసం కోడిని కూడా పెంచుకోరు.


దీని వెన‌క ఓ స్టోరీ కూడా ఉంది. కంచిరావుపల్లి లో సోమసాద్ గురూజీ తన కుటుంబంలో ఒకరిగా  ఒక కోడిని చూసుకుంటూ ఉండేవారు. అలాంటి కోడి ఒకరోజు గురూజీ నోట్లోనుంచి పడిన ఉమ్మి తినడంతో ఆ రోజు నుంచి ఆ గ్రామస్తులు అందరూ కోళ్లను పెంచడం మానేశారు. నాటి నుంచి నేటికీ మా ఊళ్లో కోళ్ల పెంపకం ఆపేశారు. గుడ్లు, కోడి మాంసం తినకూడదు అన్న ఆయన మాటకు కట్టుబడి అందరూ అదే ఆచారం పాటిస్తున్నారు. అంతేకాదు చేపలు కూడా తాము తిన‌మ‌ని వారు చెబుతున్నారు.


అయితే ఈ గ్రామస్తులు మాత్రం ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు మేకల మాత్రం పెంచుకుంటూ ఉంటారు. మేకలను ప్రేమ దేవతగా భావించే తమ గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి మాత్రం మీరు బలిదానం చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామంలోని కాదు... బంధువుల ఇళ్లలో జరిగే కార్యక్రమానికి వెళ్లిన గ్రామ ఆచారాలు పాటిస్తామని వారు చెబుతున్నారు. ఇక ఈ సంప్రదాయం పాటిస్తున్న ఆ తండా పాడిపంటలు, పచ్చదనంతో కళకళలాడుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: