ఓబులవారిపల్లె లైన్ కోసం అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తాను మొదట ప్రతిపాదించానని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. అప్పటినుండి దీన్ని కార్యరూపంలోకి తేవడానికి తన వంతు కృషి చేస్తున్నానని అన్నారు.  కృష్ణపట్నం పోర్ట్ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. వెంకటాచలం రైల్వే లైన్ ద్వారా జరిగే సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీరుస్తోందని, సరుకు రవాణా వినియోగదారుల అవసరాలను తీర్చడంతో పాటు, తన సలహా మేరకు ప్రయాణీకుల రవాణా సౌకర్యాలను కూడా అందించడానికి మంత్రి అంగీకరించడం పరిసరప్రాంత ప్రజలకు చక్కటి అవకాశం అని  వెంకయ్యనాయుడు అన్నారు.




వెంకటాచలం - రాపూర్ మధ్య ప్రయాణీకుల సేవలను ప్రారంభించడం వల్ల ఏడు స్టేషన్ల మధ్య ప్రయాణికుల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేరుతుందన్నారు. వెంకటాచలం - రాపూరు మధ్య ప్రయాణీకుల సేవలను ప్రారంభించాలన్న తన సూచనను అంగీకరించినందుకు రైల్వే మంత్రి  పియూష్ గోయల్ మరియు రైల్వే బోర్డుకి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణపట్నం నుండి రాపూరు వరకు అన్ని రైల్వే స్టేషన్లలో వివిధ ప్రయాణీకుల సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ కొత్త మార్గంలో ప్రయాణీకుల సేవలు ప్రారంభమైతే ఈ ప్రాంత ప్రజలకు సురక్షితమైన చవకైన రవాణా సౌకర్యాన్ని పొందుతారని అన్నారు.





ఈ ప్రాజెక్టును త్వరితగతిన (స్పెషల్ పర్పస్ వెహికిల్) ద్వారా పూర్తి చేసినందుకు రైల్వే మంత్రిత్వ శాఖను, ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్)ను అభినందించారు. కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ (కెఆర్‌సీఎల్) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కృష్ణపట్నం పోర్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాగర్ మాలా డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మరియు ఎన్‌ఎండీసీ సంస్థలు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును 43నెలల రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు అధికారులు, ఇంజనీర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్మికులందరినీ వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: