జగన్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. సరిగ్గా పండుగలు వస్తున్న వేళ తీసుకున్న ఈ నిర్ణయం పెను సంచలనం రేపుతోంది. దీని వల్ల పసుపు తమ్ముళ్ళు ఇంకా పట్టుకుని వేలాడుతున్న పదవులు ఒక్కసారిగా రాలిపోయాయి. రాజకీయ నిరుద్యోగం ఇపుడు టీడీపీలో నూరు శాతానికి చేరినట్లైంది. ట్రస్ట్ బోర్డులు రద్దుతో ఇపుడు అందరి ద్రుష్టి ఒక్కసారిగా సర్కార్ మీదకు మళ్ళింది.


ఏపీవ్యాప్తంగా ఉన్న 2,500 దేవాలయాల‌కు ఇపుడు ఉన్న ట్రస్ట్ బోర్డులను రద్దు చేస్తూ జగన్ సర్కార్ అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపుగా వేలల్లో పదవులు ఒక్కసారిగా ఖాళీ అయిపోయాయి. ఈ పదవులను ఇపుడు వైసీపీ కార్యకర్తలతో నింపేందుకు అవకాశం ఏర్పడింది. చాలా చోట్ల చూసుకుంటే ఇంకా ట్రస్ట్ బోర్డు పట్టుకుని వేలాడుతున్న టీడీపీ తమ్ముళ్ళకు తాజా ఆదేశాలకు ఝలక్ ఇచ్చినట్లైంది.


ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఆలయ ట్రస్ట్ బోర్డుల విషయంలో ఓ చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం యాభై శాతం పైగా పదవులు మహిళలు, వెనకబడిన తరగరుల వారికి ఇవ్వాలని అందులో రూపొందించారు. దాని ప్రకారం చూసుకుంటే ఇపుడు ట్రస్ట్ బోర్డు పదవుల ద్వారా వేలల్లో బీసీలకు, మహిళలకు అవకాశం లభిస్తుంది.


ఏపీలో కీలకమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, మెంబర్లు అంటే ఎంతో గౌరవం, డిమాండ్ ఉంటుంది. అటువంటి కీలకమైన పదవులకు ఇపుడు మహిళలు, బీసీలు కూడా ఎటువంటి పోటీ లేకుండా ఎన్నుకోవడానికి జగన్ సర్కార్ తెచ్చిన చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. తొందరలోనే ఈ పదవులను భర్తీ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలియచేశారు. మరి కొత్త బోర్డు మెంబర్స్ ఎవరో తొందరలోనే తెలుస్తుంది.  ఎవరి అద్రుష్టం ఎలాంటిదో కూడా చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: