సాహో అంటే ఆహో అని సినిమాహాళ్ళకు పరిగెత్తిన వాళ్ళను వెనక్కు పరిగెత్తించేలా మూవీ ఉందని మొదటి షో నుంచే భయంకరమైన ప్రచారం మొదలైంది. సాహో బాహుబలిని కొట్టేస్తుంది. వేయి కోట్ల సినిమా, రెండు వేల కోట్ల వసూళ్ల సినిమా అంటూ ఊదరగొట్టారు. కానీ సాహో నీరసం అంతా ఇపుడు కనిపించదు ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నారు.


సాహో సినిమాను పదివేళ స్క్రీన్లతో రిలీజ్ చేశారు. మొత్తానికి మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ కుమ్మేశారు. దాంతో ఎటు చూసినా బుకింగ్ క్లోజ్ అంటూ  ఇపుడు  బోర్డులు పడుతున్నాయి. బయట దారుణమైన టాక్ ఉన్నా కూడా ముందే టికెట్ కొన్న వారు వెళ్ళి చూడాల్సిందే.  దాంతో నాలుగు రోజుల కలెక్షన్లకు ఎటువంటి డౌటూ లేదు.


ఇక తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే వినాయ‌కచవితి పండుగ ఉంది. దాంతో ఆ పండుగ వరకూ బుకింగులు అయిపోయాయి. దాంతో సాహో సోలోగా కుమ్ముకోవడానికి అంతా బాగానే ఉంది. అయితే అసలు కధ ముందుంది అంటున్నారు మంగళవారం నుంచి సాహోకు అగ్నిపరీక్ష ఎదురవుతుంది అంటున్నారు. అపుడు అడ్వాన్స్ బుకింగులు ఉండవు,  డైరెక్ట్ గా టికెట్ కొనే వారు ఎందరు ఉంటారు, ఎంతమంది థియేటర్ కి వస్తారన్నది పెద్ద ప్రశ్న


ఇదే ఇపుడు సాహో టీం ని కలవరంపెడుతోంది.ఈ నాలుగు రోజుల కలెక్షన్లు కూడ  బ్రేక్ ఎవెన్ కి అయ్యేందుకు ఎక్కడా సరిపోవు. లాంగ్ రన్స్ లో ఫుల్స్ ఆడుతూఅ మరో రెండు వారాలు ధాటిగా ఆడితీనే సాహో బతికి బట్టకడుతుంది. చూస్తూంటే ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. దాంతో సాహో పీకల్లోతు కష్టాల్లో, నష్టాల్లో మంగళవారం నుంచి పడబోతోందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అదే నిజమైతే సాహో బాధలు ఇన్నీ అన్నీ కావేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: