2014లో ఉన్న పవన్ కళ్యణ్ కు ఇప్పుడు 2019 లో ఉన్న పవన్ కు  కనిపిస్తోంది.  ఈ తేడా వెనుక చాలా అర్ధం ఉన్నది.  2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినపుడు చాలా కకాన్ఫిడెన్స్ గా ఉండేవాడు.  పార్టీ కోసం అవసరమైతే ప్రశ్నించడానికి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.  ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పవన్ తెలుగుదేశం పార్టీతో బంధుత్వాన్ని రద్దు చేసుకున్నాడు.  


స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేయడానికి సిద్ధం అని చెప్పారు.  దీన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.  పవన్ జనసేన తరపున ప్రచారం కూడా నిర్వహించారు.  మొత్తానికి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.  ఆ తరువాత కొన్ని రోజులు సర్దుకోవడానికి సమయం తీసుకున్నారు.. 


మొత్తానికి తెలుగుదేశం పార్టీ సక్సెస్ ఫుల్ గా స్పెషల్ స్టేటస్ ను పక్కన పెట్టాయి.  మొదటి నుంచి వైకాపా స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్తున్నారు. దీంతో వైకాపా అధికారంలోకి వచ్చింది.  ఢిల్లీ సంకీర్ణ ప్రభుత్వం వస్తే చక్రం తిప్పొచ్చు అనుకున్నారు.  కానీ, కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో ఎన్నికల్లో గెలుపొందింది.  ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి అడగడం తప్పించి చేసే పరిస్థితి ఏమి లేదు.  ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి ప్రత్యేక ప్రతిపత్తిని పక్కన పెట్టారో అప్పుడే జగన్ కూడా స్పెషల్ స్టేటస్ గురించి పక్కన పెట్టారు.  


మొన్నటి వరకు మోడీని విమర్శించిన క్రమంగా తన రూటును మారుస్తున్నారు.  మోడీని పొగడం మొదలుపెట్టాడు.  అలానే అమిత్ షాను కూడా పవన్ కళ్యాణ్ పొగడ్తల ముంచెత్తుతున్నాడు.  రాజధానిని మార్చాలని చూస్తే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలను కలిసి రాజధాని గురించి మాట్లాడతానని అంటున్నాడు.  గతంలో పవన్ కళ్యాణ్ గురించి మోడీ కొన్ని మాటలు అన్నాడు.  పవన్ అంటే ఇష్టం అని తన ఐడియాలజీ బాగుంటుందని అన్నారు.  పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరం కాకుండా ఉంటె ఇప్పుడు మరోలా ఉండేది. 

కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళినపుడు అక్కడ రామ్ మాధవ్ ను కలిశారు.  ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.  జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారేమో అనే టాక్ వచ్చింది.  కానీ, పవన్ అందుకు సిద్ధంగా లేరని అన్నారు.  ఇప్పుడు చూస్తుంటే పవన్ బీజేపీకి దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది.  పవన్ ఎన్డీఏలో భాగస్వామ్యం చేస్తే.. తప్పకుండా ఏదో ఒక పదవి రావడం ఖాయం.  మరి పవన్ ఎలా ఆలోచిస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: