జబర్దస్ద్ షోతో ఎక్కడలేని పాపులారిటిని తన స్వంతంచేసుకున్న నటి అనసూయ ఈ మధ్య ఓ విషయంలో తెగ ఫీలవుతున్నట్లు వుంది,అంతేకాదు,తీవ్ర ఆవేదనతో,నా గుండె బద్దలైనంత పనైందని పేర్కొంటూ,సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.ఆమె పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ అనసూయ ఎందుకంత ఫీల్ అవుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.వివరాల్లోకి వెళ్లితే..




ఈ ప్రపంచంలో జీవకోటి ప్రాణికి ప్రాణవాయువును అందించేవి అడవులు మాత్రమే.జీవవైవిధ్యాన్ని కాపాడుతూ,గాలిలోని కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చి మానవాళి మనుగడలో గొప్ప ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.అలాంటి అడవులు అగ్నికి ఆహుతైపోతుంటే,అడవుల్లోని ప్రాణులను కార్చిచ్చు నిర్దాక్షిణ్యంగా దహించేస్తుంటే ఆ దృష్యాన్ని చూస్తూ బాధపడని మనసు వుంటుందా అంటూ ప్రస్తుతం అనసూయ ఇలాంటి బాధనే వ్యక్తపరుస్తూ ఆవేదన చెందింది.ఈ ప్రపంచానికి ఊరిపి‌తిత్తుల్లాంటి ప్రదేశం.ఈ విశ్వం మొత్తంలో ఉండే ఆక్సీజన్లో 20 శాతం ఆక్సిజన్ అక్కడి నుంచే ప్రొడ్యూస్ అవుతుంది.అలాంటి ప్రాంతం నాశనం అయితే ప్రపంచ మానవాళికే ముప్పు తప్పదు.‘లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్'గా పిలిచే అమేజాన్ రెయిన్ పారెస్ట్ ప్రస్తుతం ప్రమాదంలో పడింది.కారణం ఏమిటో తెలియదు కానీ అడవిలో మంటలు చెలరేగి ప్రాణవాయువు అందించే లక్షలాది చెట్లు కాలి బూడిదవుతున్నాయి.దీనిపై ప్రపంచమంతా ఆవేదన చెందుతోంది..



ఈ నేపథ్యంలోనే అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.''అమేజాన్ రెయిన్ పారెస్ట్ కాలి బూడిద కావడం అనే వార్త విని నా గుండె బద్దలైంది.మనిషి అని పిలువబడే రాక్షసుడు దురాశతో ఇంకా ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడు.ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేదే లేదు.ఇలాంటి దుస్థితి వచ్చినందుకు మూగదైన ఈ అభయారణ్యానికి నేను క్షమాపణలు చెబుతున్నాను.నా మీద నాకే అసహ్యం వేస్తోంది.ఇప్పటికే చాలా ఆలస్యమైందని నేను హెచ్చరిస్తున్నాను.ఇప్పటికైనా స్పందించి తగుచర్యలు తీసుకోకపోతే ఆ తరవాత విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ మిగలదు'' అంటూ అనసూయ ఆవేదన చెందింది.గత పదిహేను రోజులకు పైగా  బ్రెజిల్ వద్ద అమెజాన్ అడవుల్లో అంటుకున్న కార్చిచ్చు అంతకంతకూ పెరుగుతూ పోయీ లక్షలాది వన్యప్రాణులను అగ్నికి ఆహుతి చేయడం ప్రపంచంలో ప్రతి వారిని కలచి వేస్తోంది.ఇప్పటికే వాతవారణంలో కలిగే మార్పులనే జీర్ణించుకోలేక పోతున్నాం.ఈ సంఘటనతో భూతాపం మరింత పెరిగి పుడమి వేడెక్కి ఎన్ని ప్రమాదాలకు కారణమవుతుందోనని ఆలోచిస్తేనే భయమేస్తుంది.ఈ దుస్దితికి కారణమైన మానవుడు త్వరగా మేల్కొని పర్యావరణ రక్షణకోసం నడుం బిగిస్తేనే మంచిదంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: