మీ దేశం నుండి ఇప్పటికిప్పుడువేరొక దేశానికి వెళ్లిపోండి అని మీ ప్రభుత్వం అంటే ఎక్కడికి వెళ్లగలరు ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి పైగా ఇదే సందిగ్ధంలో ఉన్నారు. ఈ దేశం తప్ప ఆ రాష్ట్రం తప్ప మరొక ప్రపంచం తెలియని అమాయక ప్రజలకు కూడా ఇదే గతి పడుతోంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ షిప్ వారు తాజాగా విడుదల చేసిన జాబితాలో ఇది వెలువడింది.


అసలు మీరు ఈ దేశానికి చెందినవారు కాదు అని ఇక్కడనివాసం ఉండటానికి మీకు ఎటువంటి అధికారం లేదు అని ప్రభుత్వం వెల్లడిస్తోంది. విడ్డూరం ఏమిటి అంటే ఒకే కుటుంబానికి చెందిన వేరువేరు కుటుంబ సభ్యులు ఒకరికి సిటిజన్షిప్ రాగ మరొకరికి రాలేదు. తండ్రి కి వచ్చిన కొడుకు కి రాలేదు, కూతురు కి వచ్చిన తల్లి కి రాలేదు. కుటుంబం విడిపోయి చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.


కుటుంబం విడిపోయి చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బాంగ్లాదేశ్ నుండి అధికంగా రోహింగ్యాలు వలస రావడం వలన మరియు తాజాగా ఉగ్రవాదుల వలసలు కూడా అధికంగా ఉన్నట్టుగా హెచ్చరికలు రావడం వలన, ఉత్తర భారత దేశంలో ఉత్తర ఈశాన్య భారత దేశంలో అధికంగా జల్లెడ పట్టడం జరుగుతోంది. ఇందువలన అక్కడ స్థానికంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కుటుంబాలకు కూడా కష్టం కలుగుతోంది.


ఆధార్ కార్డు ని సరిగ్గా అప్డేట్ చేసుకోకపోవడం వలన ఎందరికో ఈ జాబితాలో చోటు దక్కలేదు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నవారికి కూడా ఒక్క చిన్న తప్పిదం ఉన్నా సరే లిస్టులో చోటు దక్కడం లేదు. లిస్టులో వారి పేరు లేకపోతే భారీగా అరెస్టులు జరుగుతున్నాయి. లిస్టులో పేరు లేని కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి అని అందరూ వాపోతున్నారు. ప్రభుత్వమే తమకు దారి చూపించాలి అని మొర పెట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: