ఎక్కడైతే మనం గెలిచే అవకాశం ఉండదో.. అక్కడ మనం తగ్గి ఉండాలి.  అవకాశం వచ్చే వరకు వేచి చూడాలి.  గెలిచేందుకు ప్రయత్నాలు చేయాలి.  మాములుగా ప్రజలు, వ్యాపారవేత్తలు ఇలానే చేస్తుంటారు.  పరీక్షల్లో ఫెయిల్ అయితే.. ఆ వ్యక్తి చదివి రాసి తిరిగి పాస్ కావాల్సి వస్తుంది.  అదే వ్యాపారవేత్తలైతే.. ఒకసారి వ్యాపారం లాస్ అయ్యి నష్టాలు వస్తే.. దానిపై రివ్యూ చేసుకొని తప్పులు చేయకుండా తిరిగి వ్యాపారం పుంజుకునే విధంగా చేసుకోగలగాలి.  


కానీ, అలా కాకుండా, తప్పులు చేసినా ఏమి కాదని చెప్పి.. ప్రవర్తిస్తుంటారు.  అలంటి వాళ్లలో రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు.  ఒకప్పుడు దేశాన్ని ఏలిన చాలా పార్టీలు ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి.  అలాంటి వాటిల్లో వామపక్షాలు ఒకటి.  వామపక్ష పార్టీకి చెందిన నారాయణ చేసే పనులు విచిత్రంగా ఉంటాయి.  సీరియస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు కామెడీ చేస్తున్నాడు.  


ఇదెలా ఉన్నది అంటే.. సీరియస్ యాక్షన్ హీరోగా చేసిన ఆర్నాల్డ్.. సడెన్ గా బ్రహ్మానందంగా మారి కామెడీ చేస్తే ఎలా ఉంటుంది.. అలా ఉన్నది నారాయణ చేసిన పని.  నారాయణ ఇటీవలే అమెరికా వెళ్లారు. అక్కడ వైట్ హౌస్ బయట నిలబడి ఆర్టికల్ 370 రద్దుపై స్పందించి కాశ్మీర్ కు న్యాయం చేయాలనీ, మీడియాను అడ్డుకుంటున్నారని చెప్పి ఫ్లెక్సీని ప్రదర్శించారు.  వైట్ హౌస్ ముందుకు వెళ్లినా అడ్డుకోలేదు.. కానీ, ఢిల్లీ రోడ్డుపై ఇలా ప్రదర్శన నిలబడితే లాఠీ ఛార్జ్ చేస్తారని నారాయణ చెప్తున్నాడు.  


నారాయణ చెప్పిన విషయాలు వింటుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడే సమర్ధించారు.  సమర్ధించడమే కాకుండా మోడీని మెంచుకున్నాడు. ప్రపంచం యావత్తు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ వచ్చింది.  అలానే అరబ్ దేశాలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించాయి. 


ఇప్పుడు నారాయణ అమెరికా వెళ్లి వైట్ హౌస్ ముందు ఇలా ఫ్లెక్సీ పట్టుకొని నిలబడినంత మాత్రానా ఆర్టికల్ 370 తిరిగి ఇంపోజ్ చేస్తారా చెప్పండి.  కాశ్మీర్ అభివృద్ధి కోసం ఏదైనా మాట్లాడితే అందరు చూస్తారు.  మెచ్చుకుంటారు.  అంతేకాదు.. సంవత్సరాల తరబడి పేరుకుపోయిన పాత ఐడియాలజీని తెరపైకి తీసుకొస్తే ఉపయోగం ఏముంటుంది చెప్పండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: