1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రెండు ప్రపంచ యుద్దాలు జరిగాయి.  మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఆయుధాలు పెద్దగా తయారు కాలేదు. దాంతో యుద్ధం పోటాపోటీగా సాగింది.  ఎదురెదురుగా తలపడాల్సిన అవసరం ఫిరంగులు, తుపాకులు అప్పుడు శరణ్యం.  దీంతో జరిగిన నష్టం తక్కువే.  కానీ అపారమైన ఆస్తినష్టం సంభవించింది.  


రెండో ప్రపంచ యుద్ధం సరిగ్గా ఈరోజున అంటే సెప్టెంబర్ 1 వ, 1939 లో మొదలైంది.  రేపటితో అంటే సెప్టెంబర్ 2 1945 లో ముగిసింది.  అంటే దాదాపు ఆరేళ్లపాటు జరిగింది.  ఈ ఆరేళ్లలో అపారమైన నష్టం జరిగింది.  అప్పటికే నౌక, విమానయాన, ఆయుధసంపత్తిని దేశాలు సొంతం చేసుకున్నాయి.  వాటిని యుద్దానికి వినియోగించారు.  అమెరికా జపాన్ పై రెండు అణుబాంబులు వేసింది.  అదే ఆఖరిసారి అలా అణుబాంబులను వేయడం.  


1945లో యుద్ధం ముగిసిన తరువాత మరలా ఏ దేశం ఏదేశంపైన అణుబాంబులు వేయలేదు.  మూడో ప్రపంచయుద్ధం వస్తుంది అనే అంటున్నారు.  ఎప్పుడు వస్తుందో తెలియదు.  దానికి సంబంధించిన ప్రయత్నాలైతే జరుగుతున్నాయి.  ఇప్పుడు ప్రతి దేశంకూడా ఆయుధ సంపత్తిని అపారంగా సమకూర్చుకుంటోంది.  దేశాల రక్షణ కోసమే అధికంగా నిధులను కేటాయిస్తున్నారు.  ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పని చేస్తున్నది.  


అమెరికా వంటి దేశాలు ఉగ్రవాద నిరోధం కోసం బిలియన్ల డాలర్లను పాకిస్తాన్ కు ఇస్తోంది.  ఉగ్రవాదాన్ని అరికట్టకుండా.. పాక్ ఉగ్రవాదుల ఎదుగుదల కోసం పాకిస్తాన్ ఆ నిధులను ఖర్చు చేస్తున్నది.  అంతేకాదు ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాపై పాకిస్తాన్ ఎగిరెగిరి పడుతున్నది.  ఇండియాపై యుద్ధం చేస్తామని అంటోంది.  అక్కడితో ఆగకుండా అణుయుద్దానికి సైతం సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తోంది.


ఈ యుద్ధ ప్రభావం ప్రపంచంపై కూడా పడుతుందని హెచ్చరితోంది పాకిస్తాన్.  ఈ విధంగా చూసుకుంటే.. పాకిస్తాన్ చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే.. ఏదో ఒక సమయంలో సడెన్ గా దాడికి దిగేలానే కనిపిస్తోంది.  ఇదే జరిగితే.. ఏ దేశము చూస్తూ ఊరుకోదు.  తిరిగి దాడి దాడి చేస్తుంది.  చివరకు ప్రపంచంలో మిగిలేది బూడిద మాత్రమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: