దేశ ఆర్ధిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోడీ సర్కార్‌ మరోమారు భారీ సంస్కరణలకు తెరలేపింది. పలు బ్యాంకులను విలీనం చేయాలని తాజాగా నిర్ణయించింది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)లను కలిపి కొత్తగా నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. శుక్రవారం ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2017లో దేశంలో 27 పిఎస్‌బిలు ఉండగా.. ఇప్పటికే పలు సార్లు విలీనం చేయడం ద్వారా వీటి సంఖ్యను 12కు తగ్గిస్తున్నామన్నారు. 


ఈ సందర్భంగా బ్యాంకుల విలీనం ఉపసంహరించుకోవాలని, ఎన్‌డిఎ ప్రభుత్వం డౌన్‌డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆంధ్రాబ్యాంక్‌ అవార్డు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జోనల్‌ కార్యదర్శి మహ్మద్‌ సయ్యద్‌బాషా, కోశాధికారి ఎం.కిషోర్‌బాబు, ఉమెన్స్‌ కన్వీనర్‌ ఎం.నాగపావని, ఎఐబిఒసి జనరల్‌ సెక్రెటరీ ఎంవి నిరంజన్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి, కార్పొరేట్‌ శక్తుల కోసమే బ్యాంకుల విలీనం చేస్తున్నారని మండిపడ్డారు.
 ఇదిలా ఉంటే... బ్యాంకింగ్ రంగంలో కూడా నష్టాలు వస్తున్నాయని, బ్యాంకులు విలీనం సరైందా విలీనం వల్ల నష్టాలు  తగ్గుతాయా. సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా. మొండి బకాయిలు వసూలు చేయగలరా.  కార్పొరేట్ శక్తులకు ఇచ్చినవా, సామాన్యులకు ఇచ్చినవా, పరిశీలించవలసి ఉంటుంది. ఒక బ్యాంకు కార్పొరేట్ కంపెనీలకు కోట్ల రూపాయల ఇస్తుంది.   సామాన్యుడికి కొద్ది మొత్తంలో ఇస్తాయి .పెద్ద కంపెనీలు కోట్ల రూపాయలు ఎగ నామము పెడుతుంటే వారి వద్ద నుండి మొండి బకాయిలు ఎలా రికవరీ చేయాలి ఏమైనా చట్టాలు అవసరం ఉన్నాయా ఆలోచన చేయవలసి ఉంటుంది కాని బ్యాంకులు విలీనము  పరిష్కారం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి 2008 ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పెద్ద బ్యాంకులన్నీ కుప్పకూలాయి అప్పటిలో చిన్న బ్యాంకులు మేలని చెందిన అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశాలు సైతం చిన్న బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాయి భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకులను  విస్తరించవలసి న అవసరం ఉంది విలీనం చేస్తే బ్యాంకుల  తగ్గుతాయి ఉద్యోగులు సంఖ్య తగ్గుతుంది సేవలు కూడా తగ్గుతాయి పెద్ద బ్యాంకులు పెద్ద పెద్ద కార్పోరేట్ శక్తులుకు మాత్రమే రుణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి చేనేత కార్మికులకు ప్రజలకు రుణాలు ఇవ్వడం తగ్గుతుంది బ్యాంకులు ఎక్కువగా ఉంటే వాటి మధ్య పోటీ పెరుగుతుంది సేవలు మరింత విస్తరిస్తాయి . బ్యాంకులు సంఖ్య తగ్గే కొద్ది కార్పొరేట్ కంపెనీలకు లోన్ ఇచ్చే విధంగా తయారవుతాయి. 


డిపాజిట్లు సాధారణంగా  పెన్ష‌న్‌ పొందేవారు జీతాలు పొందే వారు సామాన్య ప్రజలు ముందస్తు అవసరాలకు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తారు కానీ పెద్ద కంపెనీలు కార్పోరేట్ లు  డిపాజిట్లు వెయ్యరు  ఇది సమాజానికి నష్టం జరుగుతుంది సాఫ్ట్వేర్ రంగం తర్వాత బ్యాంకింగ్ రంగం లోనే అత్యధిక ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వ‌ల్ల ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం. ఊహించని స్థాయిలో కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయడంతో ఒక్కసారిగా ఖాతాదారుల్లో కాస్త కంగారు మొదలైంది. విలీనం అవుతున్న బ్యాంకుల్లో ఖాతా ఉన్న తమకు ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ మధ్యకాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో అనుబంధ బ్యాంకులు విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే విలీనం అయ్యే సందర్బంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. గ‌తంలో మోడీ ప్ర‌భ‌/త‌్వం తీసుకున్న పాత నోట్ల ర‌ద్దుకు ప్ర‌జ‌ల ఇక్క‌ట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.  ఏవైనా మార్పులు చేర్పులు జరిగినప్పుడు మాత్రం వాటి గురించి ఖాతాదారులకు తెలియజేస్తారు. అప్పుడు బ్యాంకుకు వెళ్లడం ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా తగిన సమాచారం ఇస్తే సరిపోతుంది. కాగా బ్యాంకుల విలీనం ద్వారా మన ఖాతాలు, డెబిట్ కార్డులు, ఈఎంఐ లపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం... 



మరింత సమాచారం తెలుసుకోండి: