మన భారతదేశంలో ట్రైన్లు ఎప్పుడు లేట్ గా వస్తా అన్న విషయం అందరికీ తెలిసిందే దీనిపైన ఎంతోమంది జోకులు వేస్తూ ఉంటారు సినిమాలో కూడా పాటలు పాడుతూ ఉంటారు కానీ ఇకపై నుంచి ట్రైను లేటుగా వస్తే మీకే తిరిగి డబ్బులు వస్తాయని మీకు తెలుసా. ఇది ప్రతి ట్రైన్ కి అమలు అవుతుంది అని మీరు పొరపాటు పడి వెళ్లి అధికారులతో గొడవలు పెట్టుకోవడం మొదలు పెట్టకండి ఎందుకంటే ఇది కేవలం ప్రైవేటు ట్రైన్లు గా నడుపుతున్న తేజస్ ట్రైన్ లకు మాత్రమే వర్తిస్తుంది.

ప్రైవేట్ సంస్థల ద్వారా నడపబడుతున్న ట్రైన్ అయిన తేజస్ గనక లేటుగా వస్తే టైంకి ఎక్కువ విలువ ఇచ్చే ప్రైవేటు సంస్థలు ఎలా వారి విధులను సక్రమంగా కస్టమర్స్కు అందించడానికి ఆఫర్స్ అందిస్తాయో అలాగే లేటుగా వచ్చిన ట్రైన్ కు తిరిగి డబ్బులు చెల్లించి ఒక ఆఫర్ను వెల్లడించారు. ఇది తేజస్ పేరు ప్రఖ్యాతలు పెంచేందుకు మార్కెటింగ్ జిమ్మిక్ అయినా కూడా లేటుగా వస్తే నిజంగానే డబ్బులు చెల్లిస్తారు. సో నెమ్మదిగా మన ట్రెండ్ సరిగ్గా సమయానికి రావడం మొదలవుతాయి అన్నమాట ఇదే ధోరణి మన బస్సులకు కూడా అవలంబిస్తే చాలా బాగుంటుంది కదా అని సిటిజన్లు జోకులు వేయడం మొదలుపెట్టారు.

పిజ్జా డెలివరీ బాయ్ గనుక మన పిజ్జా 30 నిమిషాలు లేటుగా తీసుకు వస్తే దాని ఫ్రీగా ఇస్తాము అని పిజ్జా హట్ వాళ్ళు ఎలా అయితే ఆఫర్ ను అందించారు ఇకపై అదేవిధంగా తేజస్ ట్రైన్ లు కూడా గంట లేటుగా వస్తే మీ డబ్బులు నీకు తిరిగి చెల్లిస్తామని హామీలు అందిస్తున్నాయి. ఇది ఇప్పుడు నవ్వు తెప్పించే విషయమే అయినా ఇలా ప్రైవేటైజేషన్ చేయడం వలన మన భారతదేశంలోని సర్వీసుల యొక్క నాణ్యత పెరిగిపోతోంది అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లైట్లో అంతమంది ప్యాసింజర్ లకు 3 టాయిలెట్లు ఉన్న ట్రైన్లో ఇంతమంది పాసెంజర్ లకు ప్రతి భోగి ఇన్నేసి టాయిలెట్లు ఎందుకు ఉన్నాయని అవి తగ్గించడం వలన మనకు డబ్బులు ఎక్కువ మిగులుతాయని దాని ద్వారా సేవలను మరింత బాగా ఇవ్వగలమని ప్రైవేట్ ఆర్గనైజేషన్ సంస్థలు భావిస్తున్నాయి. ఇటువంటి మార్పులను మనం మన భారతదేశం ట్రైలర్లో ఇక ముందు ఎన్నో చూడబోతున్నాము.


మరింత సమాచారం తెలుసుకోండి: