"విఘ్నాలను ప్రారద్రోలే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. మనం ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా పూర్తి కావాలని కోరుకుంటాం. ఈ ఏడాదిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు చేపట్టబోయే ముఖ్యమైన పనులు విజయవంతం కావాలని, విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటింటా శుభాలు, విజయాలు కలగాలని, ఆ గణనాథుడు ప్రజలందరికీ సుఖ సంతోషాలు కల్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాక్షాంలు తెలియజేస్తున్నాను" అని తెలుగుదేసం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  

పర్యావరణ కాలుష్య రహితంగా ప్రజలు వినాయక చవితి వేడులు జరుపుకోవాలి. ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజించుకొని ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రసాయనాలు కలిగిన విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకుండా.. ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను వినియోగించాలి. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు మట్టి సహజ రంగులతో తయారు చేసిన విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు.  


దేశంలోని ప్రతి ఒక్కరు వినాయక చవితి పండుగను ఎకో ఫ్రెండ్లీ పండుగగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు.  కారణం ఏంటో తెలుసా.. ఈ పండుగ తోనే మనిషి లైఫ్ ప్రారంభం అవుతుంది.  ఇది నిజం ఎందుకంటే.. ఈ పండుగతో దేశంలోని వాతావరణం మార్పు చెందుతుంది.  చలిగాలులు.. వర్షాలు కురుస్తుంటాయి.  ఈ వర్షాల కారణంగా రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది.  రోగాల బారి నుంచి బయటపడాలి అంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  


వినాయక చవితి రోజున పత్రికలో వినియోగించే ప్రతి మొక్కలో ఔషధం ఉంటుంది.  ఆ మొక్కలను తాకినప్పుడు తెలియకుండానే మానవ శరీరంలోకి అనేక ఔషదాలు చేరుతాయి.  ఈ ఔషదాలు శరీరాన్ని వివిధరకాల రుగ్మతల నుంచి కాపాడతాయి.  అందుకోసమే వినాయక చవితి పండుగను చేసుకుంటారు.  ఈ పండుగలో చాలా స్పెషల్ ఉన్నది.  పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగను ఏంతో గొప్పగా చేసుకుంటారు అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: