రాష్ట్రంలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి లేదా అంత‌కు ముందుగానే ఎన్నిక‌లు వ‌చ్చినా.. త‌మ స‌త్తా చాటాల‌ని బీజేపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త‌ను త‌మ ఖాతాలో వేసుకుని, ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇటీవ‌ల కాలంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల‌కు బీజేపీ ద‌గ్గ‌ర‌వుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే అటు , కాకుంటే ఇటు అనే ధోర‌ణిలో నాయ‌కులు ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు. అయితే, వీటికి నాయ‌కులు చెక్ పెట్టారు. 


తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు చెందిన హైదరాబాద్ ఇంట్లో… ముఖ్యనేతలంతా భేటీ అయ్యారు. నివాసంలో ఈ సమావేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. పార్టీ జాతీయ నేత రాంమాధవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా కీలక నేతలంతా హాజరయ్యారు. రాజకీయాల్లోఎలా బలప డాలన్నదానిపై చర్చించారు. ఏపీ రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ స్పష్టంగా ఉందని, రాజధానిని అమ రావతిలోనే కొనసాగించి నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావా లని సమావేశంలో నిర్ణయించారు. పోలవరంపై ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని నిర్ణ‌యించారు. 


ఈ అంశంపై రాష్ట్రంలో ప్రజల మనోభావాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించా రు. ఈ రెండు అంశాల్లో బీజేపీ నుంచి విభిన్న అభిప్రాయం లేకుండా ముందుకు సాగాల‌ని తీర్మానించా రు. ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. అటు టీడీపీని వ‌ద్ద‌ని అనుకుంటున్నా.. కీల‌క నేత‌ల‌ను టీడీపీ నుంచి బీజేపీలోకి చేర్చుకున్న క్ర‌మంలో. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబుకు ద‌గ్గ‌ర కావాల‌ని బీజేపీ నిర్ణ‌యించుకుంటున్న విష‌యం తెలిసిందే. దీనికి త‌గిన విధంగా బాబు కూడా రాజ‌కీయ వైరం వ‌దిలి స్నేహం చాటేందుకు ఉన్న అన్ని అవ‌కాశాల‌ను కూడా స‌ద్వినియోగం చేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 


జ‌మ్ముక‌శ్మీర్‌కు సంబంధించి ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును దేశంలోని మోడీ వ్య‌తిరేకులు అంద‌రూ కూడా వ్య‌తిరే కించారు. కానీ, రెండు నెల‌ల కింద‌టి వ‌ర‌కు మోడీ హ‌టావో నినాదంతో దేశంలో ప్ర‌చారం చేసిన చంద్ర బాబు మాత్రం ఈ ర‌ద్దును స‌మ‌ర్ధించుకున్నారు. ఇక‌, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు అరుణ్ జైట్లీ మృతి చెందితే.. బీజేపీ సీనియ‌ర్లే ఆయ‌న పార్థివ దేహాన్ని చూసేందుకు ఒక‌రిద్ద‌రు బిజీగా ఉండి వెళ్ల‌లేక పోయా రు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ప‌నిగ‌ట్టుకుని ఢిల్లీ వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఇలా ఆయ‌న చూపుతున్న స‌న్నిహి త‌త్వంతో మున్ముందు బీజేపీ బాబుతో జ‌త‌క‌ట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: