ఇటీవల కాలంలో ఇంట్లో వండుకొని తినడం కంటే హోటల్ కు వెళ్లి తినే వాళ్ళు ఎక్కువయ్యారు.  ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక.. ఆన్లైన్ ద్వారా భోజనం తెప్పించుకొని తింటున్నారు.  ఇంట్లో వండుకున్నా అదే ఖర్చు అవుతుందని భావించి ఇంట్లో తినకుండా.. బయటనుంచి తెప్పించుకుంటున్నారు.  బయట నుంచి తెచ్చుకోవడం వలన ధర తక్కువ అవుతుంది.  శ్రమ తగ్గిపోతుంది.  ఆ సమయాన్ని మిగతా విషయాలపై  ఫోకస్ చెయ్యొచ్చు అన్నది వారి ఉద్దేశ్యం.  


అందుకే ఫుడ్ యాప్స్ ఎన్ని వచ్చినా వాటికి క్రేజ్ పెరుగుతూనే ఉన్నది.  ఎక్కడా తగ్గడం లేదు.  ఇక ఇదిలా ఉంటె, ఇటీవల కాలంలో బిర్యానీ లవర్స్ పెరిగిపోతున్నారు.  విపరీతంగా బిర్యానీని తింటూ కలం గడిపేస్తున్నారు.  కొన్ని కొన్ని చోట్ల తమ రెస్టారెంట్ ను పాపులర్ చేసుకోవాలని చెప్పి కొన్ని రకాల పోటీలు నిర్వహిస్తుంటారు . 


ఇలాంటి పోటీని ఇటీవలే ఈరోడ్ నగరంలోని పెరిదురై రెస్టారెంట్ లో బిర్యానీ పోటీలు నిర్వహణకు  దరఖాస్తులు ఆహ్వానించగా.. పోటీలో పాల్గొనడానికి 500 మంది రిజిస్టర్ చేసుకున్నారు.   అందులో 25 మందిని సెలక్ట్ చేయగా.. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.  వీరికి కేజీ బిర్యానీని పెట్టారు.  కేజీ బిర్యానీని ఎవరు ఎంత సేపట్లో తింటారు అన్నది పోటీ. 


ఈ పోటీలో రఘుల్ అనే యువకుడు 9 నిమిషాల్లోనే కేజీ బిర్యానీని తిని మొదటి స్థానంలో నిలిచాడు.  మొదటి స్థానంలో నిలిచిన రఘుల్ కు రెస్టారెంట్ యాజమాన్యం 5వేల రూపాయలను బహుకరించింది.  రెండో స్థానంలో నిలిచిన వ్యక్తి 13 నిమిషాల్లో కేజీ బిర్యానీ తిన్నాడు.  ఈ పోటీలు ఆసక్తికరంగా సాగాయి.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈరోడ్ లో ఇలాంటి పోటీలు సహజమేనట.  ఈ పోటీలకు అక్కడి యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: