వాహన దారులకు చుక్కలు కనిపించే రోజు రానే వచ్చింది.ఆ చుక్క పేరే జరిమానా.ఈ వినాయక చవితి కానుకగా ప్రభుత్వం ఇస్తున్న గిఫ్ట్.ఇక ఈ పండగ వచ్చింది పైసలకు రెక్కలు తెచ్చింది.అసలే పెరుగుతున్న ధరలతో పెనం మీద పడ్డట్టున్న ప్రజల జీవితాలకు ఈ వాహన చట్టం మరో నిప్పు తునకే అయ్యింది ఎందుకంటే ఇకనుండి పనిమీద కాని,షికారుకు కాని ఎటైన కాని బయటకు వెళ్లాలంటే చాల జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి.లేదంటే మీ సంపాదనలో సగభాగం ప్రభుత్వానికే కట్టవలసి వస్తుంది.ఇంట్లో పెళ్ళాన్ని మరచిన ఫర్వాలేదు కాని,మీ రోజువారి కార్యకలపాలకు అవసరమైన వస్తువులతో పాటు మీ వాహ నానికి సంబంధించిన పత్రాలను అసలే మరవవద్దు.




ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌,లేనిపక్షంలో ఇంట్లో నుండి బండి బయటకు తీయవద్దు.ఎందుకంటే భారీగా రుసుం చెల్లించు కోవాల్సి వస్తుంది.అదేనండి అపరాధ రుసుం.ఇక ఈ బాదుడు నేటినుండి అంటే సెప్టెంబర్ 1 నుంచే అమల్లోకి రానుంది..ఈ చలాన పెంపు విషయాన్ని కొందరు సమర్ధిస్తుండగా మరి కొందరు వ్యతి రేకిస్తున్నారు ఇక పెంచిన ట్రాఫిక్‌ చలాన్లకు వ్యతిరేకంగా నాలుగో తేదన మహా ధర్నా చేస్తున్నామని తెలంగాణ ఆటోడ్రైవర్స్‌ జేఏసీ నేతలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన చలాన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.




శనివారం హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనియన్స్‌ జేఏసీ నేతలు మాట్లాడారు.పెరిగిన చలాన్ల ను రాష్ట్ర ప్రభుత్వం తొందరగా అమలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాను విజయ వంతం చేయాలని ఆటోడ్రైవర్లకు తెలంగాణ ఆటోడ్రైవర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు విజ్ఞప్తి చేశారు..ఇక కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ,భారీ జరిమానాలు సబబేనని,దీనివల్ల ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని కొత్త బిల్లు ప్రకారం అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా దారి ఇవ్వాల్సిందేనని అన్న విషయం తెలిసిందే ఇక దీనిపై ప్రతిపక్షాలు ఏమంటాయో తొందర్లోనే తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: