వినాయకుడిని ప్రార్ధిస్తే చాలు నిండుగా దీవిస్తాడు. తన నాయకత్వ లక్షణాలు కొన్ని ప్రసాదిస్తాడు. అసలు ఆయన్ని చూస్తేనే నాయకుడు ఎలా ఉండాలో అర్ధమైపోతుంది. వినాయక చవితి పందిళ్ళు  వేసి స్వామిని కొలిచి తొమ్మిది  రోజులు పూజలు చేసేసరికి నాయకత్వ లక్షణాలు వచ్చేస్తాయి. పది మందిలో ఎలా ఉండాలో కూడా తెలుసుకోవడమే కాకుండా అందరినీ, అన్నింటినీ సమన్వ్యయం  చేసుకోవడం కూడా వినాయకుడి చవితి పందిళ్ల ద్వారానే అందించే విలువైన పాఠాలు.


నిజానికి వినాయకుడుకు కూడా ఒకపుడు పదవి కోసం ఎత్తులు వ్యూహాలు వేసిన నాయకుడే. తన సోదరుడు కుమారస్వామితో గణాధ్యక్ష పదవి కోసం పోటీ వచ్చినపుడు వినాయకుడు తెలివిగా ఆలోచించి ముల్లోకాలను తిరగకుండా తన తల్లి తండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగేసి విజేత అయ్యాడు. గణాధ్యక్షుడు అయిపోయాడు. అంటే షార్ట్ మెదడ్స్, ట్రిక్కులు అన్నీ కూడా వినాయకుడు తన కాలంలోనే అమలు చేసి చూపించాడన్నమాట.


ఇదిలా ఉండగా ఇపుడు నాయకులు సైతం వినాయకున్ని అనుసరిస్తూ అధినాయకులకు మొక్కుతూ పదవులు తెచ్చుకుంటున్నారు. అంతే కానీ జనంలో నుంచి నాయకులుగా ఎదగాలని ఎవరూ అనుకోవడంలేదుగా. ఇక వినాయకుడు మాస్ నాయకుడు, పది మంది ఉండాలి. భజనలు, భజంత్రీలు ఉండాలి. 


పెద్దగా పద్ధతులు పట్టింపులు లేనివాడు, అన్ని వర్గాల వాడు, ఎవరు ఏ రూపంలో కొలిచినా వారిని దీవించే అసలైన దేవుడు, అందరివాడు. అందుకే చవితి ఉత్సవాలు అంటే చిన్నా పెద్దా అంతా కూడా అనందభరితులవుతారు. హాయిగా అంతా కలసి చేసుకుంటారు. ఆ బొజ్జ గణపతిని ఆరాధించి పూజలు చేసి ఆయన‌తో పాటు ఉండ్రాళ్ళు, కుడుములు తిని తరిస్తారు. ఆ గణపతి దీవెనలు నిండుగా పొందుతారు. తమకు కూడా పెద్ద పదవులు ఇచ్చి పీఠంపై కూర్చొబెట్టేలా చేయమని అర్ధిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: