చంద్రయాన్ 2 ప్రయోగం విజవంతం అయ్యింది.  సెప్టెంబర్ 7 వ తేదీన చంద్రయాన్ 2 చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది.  అలా ల్యాండ్ అయిన 4 గంటల తరువాత అందులోని రోవర్ బయటకు వచ్చి.. పరిశోధన స్టార్ట్ చేస్తుంది.  ముఖ్యంగా అక్కడి నెలలో నీటి జాడ గురించి అన్వేషణ చేస్తుంది.  ఈ అన్వేషణలో నీటిజాడ కనుక్కుంటే.. ఆ తరువాత ఇండియా ఏం చేయబోతుంది.  


ఆ నీటిని ఎలా వాడుకోబోతుంది.  చందమామ నుంచి భూమిమీదకు నీటిని తీసుకురావడం అంటే మాములు విషయం కాదు.  అది ఎన్నటికీ కుదరదు.  నీటి జాడ ఉండి అవి వాడుకోవడానికి వీలుగా ఉంటె.. అక్కడ తప్పకుండా ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.  ఆవాసయోగ్యమైన ప్రాంతంగా మార్చుకోగలిగితే.. అక్కడికి జనాలను పంపించే అవకాశం ఉంటుంది. 


భవిష్యత్తులో అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.  ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు ఇది కొంత ఊరటనిస్తోంది.  అక్కడ నీరు ఏ స్థితిలో ఉన్నది అని తెలుసుకోవడం ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న.  సమాధానం కోసమే అక్కడ పరిశోధనలు చేపడుతున్నాయి.  తప్పకుండా అక్కడి నుంచి పాజిటివ్ న్యూస్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది మాత్రం దీన్నివ్యతిరేకిస్తున్నారు.  చంద్రుడి మీద నీటి జాడలు ఉంటె మనకు ఉపయోగం ఏంటి.. ఆ డబ్బును ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యల కోసం వినియోగించకుండా ఇలా ఖర్చు చేస్తున్నారని వాదిస్తున్నారు.  


దేశం కోసం ఏదోఒకటి చేయాలి అనుకునే వ్యక్తులు.. దేశ భవిష్యత్తు కోసం పట్టుబడాలి అని కోరుకునే వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడరు.  ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలి అంటే టెక్నాలజీ కూడా అవసరం ఉన్నది.  రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసిన తరువాత ఇండియా వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలను వివిధ కక్ష్యలోకి ప్రవేశపెట్టి లాభాలు గడిస్తున్నది.  అలా వచ్చిన డబ్బుతోనే ఇస్రో ప్రయోగాలు చేస్తున్నది.  ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలతో కాదు.  ఇచ్చే బడ్జెట్ తో కాదు.  ఈ విషయం తెలియని కొంతమంది వ్యక్తులు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  దేశాభివృద్ధిని కోరుకొని వ్యక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: