ప్రపంచంలో డబ్బున్నవాళ్లు ధనవంతులుకారు,డబ్బు లేనివారు పేదలు కాదు.వీటికి మించి చాలా వున్నాయి ఈలోకంలో.డబ్బును తన అవసరాలకోసం వాడుకుంటే అది స్వార్ధం అంటారు.తను సంపాదించింది ఇతరుల కోసం వాడితే త్యాగం అంటారు.అందుకే అన్నీంటి కంటే గొప్పది గుణం.ఈ గుణం వున్నప్పుడే సేవచేయాలనే ఆలోచన, త్యాగం చేయాలనే తపన,సహాయం అందించాలానే బుద్ధి దగ్గరికివస్తాయి.ఇవి లేనివాడు ఎంతున్నపేదవాడే.ఈ గుణాలున్న మనిషి తన దగ్గర ఏంలేకున్న ధనికుడే.పోయాక చూసేవి మనిషిలో ఈ రెండులక్షణాలే.ఇక కొంతమంది ఎంతడబ్బున్న బయటికి తీయక దాచుకుంటారు కాని పిల్లికి కూడ పిరికెడన్నం వేయరు.అందరు అలా వుండరు కదా.అందుకే దానం చేసే పుణ్యాత్ములు ఎక్కడో ఒకచోట వుంటారు.మరి ఈ నియమాలు అక్షరాల పాటిస్తున్న భారత కుబేరుల్లో ఒకరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.



చైనాకు చెందిన హ్యూరన్ ఇండియా సంస్థ  నివేదిక ప్రకారం 2018 సంవత్సరానికి గాను రూపొందించిన దాన శీలుల జాబితా విడుదలైంది,ఈ జాబితాలో 39మంది భారతీయులుఉండగా వారిలో మంజు డి.గుప్తా ఒక్కరే భారత మహిళ కావటం విశేషం.2017 అక్టోబర్ 1నుండి 2018 సెప్టెంబర్ 30వరకు దాతృత్వ కార్యకలాపాల కోసం 10కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన ధనవంతుల జాబితాలో భారతీయులు సగటున 40కోట్ల రూపాయల చొప్పున చారిటీ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు మొత్తంగా 1560కోట్లు ఖర్చుచేసారట.ఈ దానశీలుల జాబితాలో అయిదవస్థానంలో నిలిచినవారు లులూగ్రూప్స్ అధినేత ఎంఏ యూసుఫ్అలీ 2018 సంవత్సరానికి గాను దాతృత్వ కార్యకలాపాల కోసం 70కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన సుగుణాన్నిచాటుకున్నారు.



ఈయన దుబాయ్ కేర్స్ సంస్థతో కలిసి గాజా,జపాన్ లలో పలు పాఠశాలలను దత్తత తీసుకున్నాడు. అంతే కాకుండా గతంలో గుజరాత్ లో భూకంపం సమయంలో విరాళం,ఆసియా సునామి రిలీఫ్ ఫండ్ కు విరాళం,ఇవ్వటంతో పాటుగా ప్రపంచంలో పలుచోట్ల ప్రాకృతిక విపత్తులు వచ్చినప్పుడు విరాళాలు అందించారు.అందుకే అంటారు వున్న వాడు కాదు గొప్పోడు.వున్నా లేకున్నా పెట్టేవాడే గొప్పోడు..ఇలాంటి వారిని చూసైనా గుణం లేని వారు సిగ్గుపడాలంటున్నారు ఈయన సాయం పొందిన కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: