తెలంగాణ రాష్ట్రంలో పేద రైతుల క్షోభను  వినిపించుకొని పరిస్థితిలో ప్రభుత్వ ఉన్నత అధికారులు ఉన్నారు.భూమి సమస్య పరిష్కరించాలని వేడుకొంటూ మిర్జాగుడా, ఆలూరు గ్రామాలకు చెందిన రైతులు లింగయ్య, సత్యయ్య, మల్లయ్య  చేవెళ్ల ఎమ్మార్వో కాళ్లపై పడ్డారు. భూమి విషయమై పరిష్కారించాలంటే కాళ్ళమీద పడ్డ రైతులను చీదరించుకుంటూ.. మాకేమి పని లేదా బేవకూఫ్ అని చేవెళ్ల ఎమ్మార్వో పురుషోత్తం దుర్భాషలాడడం దౌర్భాగ్యమైన దుస్థితి నెలకొంది. సమస్య పరిష్కారం విషయంలో చివరికి కలెక్టర్ ,ఆర్ డిఓ, ఎంపీ చెప్పినా పట్టించుకోని పరిస్థితిలో ఎమ్మార్వో ఉన్నారు. ఈ వైఖరికి భాద్యత ఎవరు వహించాలని స్థానికులు నిలదీస్తున్నారు.





రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర చేవెళ్ల ఎమ్మార్వో  కాళ్లపై పడి తన భూమి సమస్యలు పరిష్కరించాలని ప్రదేయ పడ్డారో ఆలూరు,మీర్జాగుడా గ్రామానికి చెందిన రైతులు  చేవెళ్ల మండల్ ఆలూరు గ్రామానికి చెందిన లింగయ్య మరియు తన సోదరుడు సత్యయ్య మీర్జాగుడా గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతులు తాతల నుండి సాగుచేస్తున్న పొలాన్ని 2001 సర్వే నెంబర్ 326లో ఓఆర్సీ  ఇచ్చి పట్టపసుపుస్తకాలు ఇచ్చారు తరువాత 2004లో ముంతాజుద్దీన్ రేజ్వి అనే హైదరాబాద్ వాళ్లకు ఓఆర్సీ ఇచ్చారు. ఆ భూమి పై సరి చేయాలని దాదాపు 8 నెలల నుండి   కాళ్ళు తిరిగేలా  తిరిగినా స్పందించని చేవెళ్ల ఎమ్మార్వో, ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన కలెక్టర్ గారి ముందుకు తమ గోడు విన్నవించుకోవడానికి వెళ్తున్న రైతులను ఆపి  పక్కకు తీసుకుపోయి పరిష్కరిస్తానని చెప్పి కలెక్టర్ దగ్గరకు వెళ్లకుండా చేశాడు తరువాత రాత్రి 8గంటల కు పైగా వేచి చూస్తున్నా ఎందుకు నిలపడ్డారు అయ్యేటప్పుడు అవుతుంది బేవకూఫ్ ల లాగా ఎందుకు చేస్తున్నారు అని తిదుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






చేవెళ్ల ఎమ్మార్వో ఈ సమస్య పై స్పందిస్తూ రెవెన్యూ సదస్సులో పాల్గొన్నప్పుడు చిన్న సమస్య  వెంటనే పరిష్కరించాలని ఆదేశించినా ఉన్నతాధికారుల మాటను పెడచెవిన పెట్టి పని చేయని చేవెళ్ల ఎమ్మార్వో మల్లయ్య అనే రైతుకు మొత్తం 0.34 గుంటల భూమికి కేవలం 0.13 గుంటల భూమి మాత్రమే వచ్చినది దాన్ని సరిచేయలని,సత్యయ్య అనే రైతుకు 1.02  గుంటల భూమి 20 గుంటలు, లింగయ్య అనే రైతుకు 1.02 గుంటల భూమికి 20 గుంటలు మాత్రమే వచ్చినది. మిగతా పొలం హైదరాబాద్ వాళ్లకు ముంతాజుద్దీన్ రేజ్వి అనే పేర్లపై వచ్చిందని దానిని సరిచేయాలని దాదాపు 8నెలల నుండి చెప్పులరిగేలా తిరిగినా వినిపించుకోవడం లేదని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి విన్నవించుకుంటే వెంటనే ఎమ్మార్వో ఫోన్ కాల్ చేసి పరిష్కరించాలని చెప్పాడు. ఎందరి దగ్గరకి వెళ్లినా పని జరగడం లేదని ఎమ్మార్వో పురుషోత్తం కాళ్ళు మొక్కితేనైనా కనికరిస్తాడని కాళ్ళు మొక్కినా కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: