దివంగత మహానేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి నేడు. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ప్రజలకు కన్నీళ్లు మిగిల్చి అయన మృతి చెందారు. కాగా గత ప్రభుత్వం కుట్ర చేసి విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలిగించింది. ఈ నేపథ్యంలోనే నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్టించారు.     


2011 కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ లగపాటి రాజగోపాల్ విజయవాడలోని పోలీస్ కాంట్రొల్ రూమ్ వద్ద ఆ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే గత ప్రభుత్వం రాజకీయ కుట్రతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పుష్కరాలకు అడ్డు అంటూ 2016లో తొలిగించారు.                                              


అయితే అప్పట్లో ఈ విగ్రహం తొలిగించకూడదు అని వైసీపీ నేతల, ముఖ్యమంత్రి జగన్ విన్నవించుకున్నప్పటికీ తొలిగించి 2016 నుంచి కంట్రోల్ రూమ్ పక్కన ఉన్న అగ్నిమాపక కార్యాలయంలో వైఎస్ విగ్రహాన్ని ఉంచారు. దీంతో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని సీఎం జగన్ పునఃప్రతిష్టించారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ మంత్రులు కన్నబాబు, బొత్స, మోపిదేవి వెంకటరమణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కొడాలి నాని, పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ పునః ప్రతిష్ట పై నెటిజన్లు స్పందిస్తూ 'ఆ పార్టీ నేతలకు షాక్ ఇస్తూ అక్కడ వైఎస్ రాజేశేఖర రెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: