గత నెల ఐఎన్‌ఎక్స్‌ మీడియా  మనీల్యాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. గత నెల ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో సిబిఐ అరెస్ట్ చేసి చిదంబరాన్ని విచారించారు. అయన మరోసారి పెట్టుకున్న పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది.                                 


అయితే తాజాగా అయన వయసు రీత్యా తీహార్‌ జైలుకు పంపవద్దన్న ఆయన మరో పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. చిదంబరం అనారోగ్యం కారణంగా అయన వయసుని దృష్టిలో ఉంచుకొని బెయిల్‌ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలని లాయర్‌ కపిల్ సిబాల్ సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి విజ్ఞప్తి చేశారు.                             


సిబల్‌ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్‌ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది. కాగా విదేశీ పెట్టుబడులను ఐఎన్‌ఎక్స్‌ మీడియాలోకి తరలించారనే ఆరోపణలతో చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.                                                        


మరింత సమాచారం తెలుసుకోండి: