2019 ఎన్నిక‌లకు ముందు  ఏపీలో ఉన్న‌రాజ‌కీయం ఏంటంటే అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేసి ర‌క‌ర‌కాలుగా వేధించిన సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో సీన్ రివ‌ర్స్ అయింది. ఎన్నిక‌ల్లో వైసీపీ క‌నివిని ఎరుగుని రీతిలో సీట్ల‌ను గెలుచుకొని అధికారం చేపట్టింది. అధికారం చేప‌ట్టిందే మొద‌లు టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీని టార్గెట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రి భ‌ర‌తం ప‌ట్టేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక రూపొందించుకుని ముందుకు పోతున్నారు. అందులో భాగంగా ఏపీ స్పీక‌ర్ గా ప‌నిచేసిన కోడెల శివ‌ప్ర‌సాద రావు, ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావును టార్గెట్ చేసుకుని ముందుకు పోతున్నారు..


అయితే టీడీపీలోని నేత‌ల‌తో పాటు ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను వ‌ద‌ల‌కుండా టార్గెట్ చేసిన వైసీపీ నేత‌లు ఓ నేత విష‌యంలో మాత్రం చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే అనుమానాలు క‌లుగుతున్నాయి. అలా చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వైసీపీ నేతలు వ‌దులిపెడుతున్న‌ది ఓ గ‌ల్లీ లీడ‌రో, ద్వితీయ శ్రేణో నేత కాదు.. ఏకంగా చంద్ర‌బాబు మంత్రిమర్గంలో కీల‌క‌మైన మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తిని వ‌దిలేస్తున్నారు. ఇంత‌కు ఎవ‌ర‌నుకుంటున్నారు. ఆయ‌నే మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు. ఇంత‌కు ప‌త్తిపాటి పుల్లారావుపై ఎందుకు క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లకు వైసీపీ పాల్ప‌డం లేదు అంటే చాలా ఆస‌క్తి క‌లిగిస్తుంది. 


మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ రావు, ఆయ‌న కుటుంబ స‌భ్యులు విచ్చ‌ల విడిగా అవినీతికి పాల్ప‌డ‌మే కాదు, వైసీపీ నేత‌ల‌ను, పార్టీని టార్గెట్ చేసి నానా యాత‌నకు గురి చేసార‌ట‌. ఇక ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీ‌నివాస‌రావు కూడా అధికారంలో ఉన్న‌ప్పుడు మైనింగ్ వ్యాపారం చేస్తాడు. అయితే అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీని టార్గెట్ చేసి అనేక ఇక్క‌ట్ల‌కు గురిచేశాడ‌ట‌. అందుకే కోడెల, య‌ర‌ప‌తినేని ల‌పై కేసులు న‌మోదు చేసి వైసీపీ ముందుకు పోతుంది. అయితే మాజీ మంత్రి ప‌త్తిపాటి పుల్లారావు వైపు మాత్రం క‌న్నేత్తి చూడ‌టం లేద‌ట‌. ఎందుకంటే.. ప‌త్తిపాటి అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నేత‌ల వైపు క‌న్నేత్తి చూసేవాడు కాద‌ట‌. 


వైసీపీ నేత‌ల ప‌నులు కూడా చేసి పెట్టెవాడ‌ట‌. వీటికి తోడు వైసీపీ నేత‌ల‌తో వ్యాపార సంబంధాలు ఉన్నాయ‌ట‌. అందుకే ప‌త్తిపాటి పుల్లారావును టార్గెట్ చేయ‌కుండా వ‌దిలేసార‌ట‌. అంటే వైసీపీతో వ్యాపార సంబంధాలు ఉన్నా, వారితో క‌లిసి మెలిసి ఉంటే ఇక కేసులు ఉండ‌వా అనే ప్ర‌శ్న ఇప్పుడు గుంటూరు జిల్లాలో వినిపిస్తుంది. సో ప‌త్తిపాటి పుల్లారావు రాజ‌కీయాలు రాజ‌కీయాలు, వ్యాపారం వ్యాపార‌మే చేసుకుంటూ ఎవ‌రితోనూ వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు పెట్టుకోడ‌ట‌. అందుకే ప‌త్తిపాటా.. అయితే వ‌దిలేయండి అంటున్నార‌ట వైసీపీ నేత‌లు. ఆయ‌న అస‌లు క‌థ ఇది.


మరింత సమాచారం తెలుసుకోండి: