భార‌త‌దేశంను  ఉత్త‌ర భార‌తం, ద‌క్షిణ భార‌తంగా  అభివ‌ర్ణిస్తారు. ఉత్త‌ర భార‌తంలో క‌మ‌లం విక‌సిస్తున్నా.. ద‌క్షిణ భార‌తంకు వ‌చ్చే స‌రికి క‌మ‌లం ఏనాడు చిగురించ‌డం లేదు. ఒక‌టి క‌ర్నాట‌క మిన‌హా ద‌క్షిణ భార‌త దేశంలో ఎక్క‌డా క‌మ‌లం విక‌సించ‌డం లేదు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావ‌డం, ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ రెండోసారి అధికారం చేప‌ట్ట‌డంతో దేశ‌వ్యాప్తంగా బీజేపీని విస్త‌రించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ది బీజేపీ. ఇటీవ‌ల బీజేపీ తీసుకుంటున్న చ‌ర్య‌లు, నిర్ణ‌యాలు ఎలాంటి ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేక పోతున్నాయి. 


ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అని పైకి చెపుతున్న‌ప్ప‌టికి బీజేపీ ఆలోచ‌న మాత్రం ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే పార్టీ అనే ఆలోచ‌న‌తో ముందుకు పోతున్న‌ట్లు పార్టీ నేత‌ల వ్య‌వ‌హార‌శైలీ ఉంద‌నేది టాక్‌. ద‌క్షిణ భార‌త దేశంలో బీజేపీని ఎలాగైనా విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని గ్ర‌హించిన బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం అందుకు త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ క్ర‌మ‌క్ర‌మంగా అమ‌లు చేస్తుంది. అందులో భాగంగా బీజేపీ ఇటీవ‌ల క‌ర్నాట‌క‌లో ఉన్న సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. 


ఇక అప్ప‌టి నుంచి బీజేపీ దుందుడుకుగానే వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాల్లో బ‌లోపేతం అయ్యేందుకు దృష్టి సారించింది. అందుకే ఏపీలో టీడీపీ, తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీ, టీ ఆర్ ఎస్‌ల‌ను టార్గెట్ చేసి ఆప‌రేష‌న్ క‌మ‌లం దిగ్విజ‌యంగా సాగిస్తుంది. ఇప్పుడు ప్ర‌ధానంగా బీజేపీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో ద‌క్షిణ భార‌తంలో క‌రుడుగ‌ట్టిన బీజేపీ నేత‌ల‌ను గవ‌ర్న‌ర్ల‌ను నియ‌మించి వారితోనే బీజేపీ పాల‌న చేసి, పార్టీని బ‌లోపేతం చేయాల‌నే అంత‌ర్గ‌త ఆలోచ‌న‌తోనే ముందుకు పోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుతుంది. 


అందులో భాగంగానే బీజేపీకి చెందిన   ఏపీకి  బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియ‌మించారు.  తమిళనాడు, కేరళ కన్నా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బ‌లోపేతం చేసి రాబోవు పార్ల‌మెంట్ ఎన్నిక‌లే టార్గెట్ చేసుకోవాల‌ని మోదీ, అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అంటే ఇక ముందు తెలుగు రాష్ట్రాల‌తో పాటు, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో క‌మ‌ల వికాసంకు గ‌వ‌ర్న‌ర్లు ఏలా ప‌నిచేస్తారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: