భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరో అవార్డు వరించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంలో నడిచే 'బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్' పురస్కారాన్ని మోదీని అందుకోనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ప్రధాని మోదీ వినూత్న కార్యక్రమాలు చేపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పురస్కారాలు ఆయనను వరిస్తున్నాయి.





తాజాగా స్వచ్ఛ భారత్ పథకానికిగాను ప్రధానికి బిల్ - మిలిందా గేట్స్ ఫౌండేషన్ పురస్కారం దక్కింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణం ' అని కేంద్ర మంత్రి జితేంద్ర ట్విటర్‌లో తెలిపారు. ఇటీవలే ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్‌ ఆఫ్‌ జాయేద్‌'ను ప్రదానం చేసిన  సంగతి తెలిసిందే. ఈ అవార్డు తోపాటుగా ప్రపంచంలోని దాదాపుగా ఆరు ముస్లిం దేశాలు కూడా మోడీని ఘనంగా సత్కరించి మరీ తమ తమ దేశాల ప్రతిష్టాత్మకమైన అవార్డులతో గౌరవించారు. దీనితో ఏ ప్రధానికి దక్కని అరుదైన గౌరవ సత్కారాలు భారత ప్రధానిగా నేరేంద్ర మోడీ లభించడం గర్వకారణం.




ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ పథకాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా బిల్ గేట్స్ ప్రశంసించారు. మే 2018లో బిల్ గేట్స్ 'ఆధార్' పథకానికి మద్దతిచ్చారు. ఇదిలా ఉండగా దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన సంస్కరణలు స్వదేశంలోనే కాకుండా పోరు దేశ దృష్టిని ఆకర్షించాయి. రెండు వేళా రూపాయల నోట్ల రద్దు దగ్గర నుంచి ఆర్టికల్ 370  రద్దు వరకు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా  ప్రధాని మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రపంచ దేశాలను సైతం ఆలోచింప చేశాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలో  మోడీకి అత్యున్నత గౌరవం లభిస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: