గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఇండియా పై యుద్ధం చేస్తాం అవసరమైతే అణుయుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. బోర్డర్ లో అలజడిని పెంచుతోంది.  పైగా బోర్డర్ పాక్ కమెండోలను తీసుకొచ్చి కాల్పులు  జరుపుతూ..  ఉగ్రవాదులను ఇండియా భూభాగంలోకి పంపేందుకు సిద్ధం అయ్యింది.  అయితే, ఇండియా అలర్ట్ కావడంతో... బోర్డర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తగ్గిపోయాయి.  జమ్మూ కాశ్మీర్ నుంచి  చొరబడేందుకు అవకాశం లేకపోవడంతో.. ఇప్పుడు  సముద్రమార్గం గుండా ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  


ఇదిలా ఉంటె, పంజాబ్, గుజరాత్, జమ్మూకాశ్మీర్ బోర్డర్లలో ఇండియా భద్రతను కట్టుదిట్టం చేసింది.  ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించిన తరువాత ఇండియా కమెండో ఆపరేషన్ ను నిర్వహిస్తుంటుంది.  కానీ, ఈసారి ఇండియా కాస్త ముందుగా అలర్ట్ అయ్యి బోర్డర్లో ఐజీబీ ని ఏర్పాటు చేసింది.  దీనికి కోల్డ్ స్టార్ట్ అని పేరు పెట్టారు.  ఐజీబీ కమెండోలు దేనికైనా సిద్ధంగా ఉంటారు.  ప్రసుత్తం బోర్డర్లో అవసరాన్ని బట్టి 5 లేదా 6 బెటాలియన్లను సిద్ధం చేసింది.  వీరంగం ఇండియా బోర్డర్లో ఉన్నారు ప్రస్తుతం.  వీరి సంఖ్య 20వేల నుంచి 30వేలమంది వరకు ఉంటుంది.  వీరిని చిన్న చిన్న గ్రూపులుగా విభజించారు. 


ఒక్కోగ్రూప్ కు ఒక మేజర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తుంటారు.  వీరు మెరుపు వేగంతో శత్రువులపై దాడులు చేస్తుంటారు.  ఇకపై పాక్ కాల్పుల  విరమణను ఉల్లంఘించి కాల్పులకు పాల్పడినా.. ఉగ్రవాదులను ఇండియా భూభాగంలోకి చొరపడే విధంగా చూసినా.. ఈ ఐజీబీ  దాడులు చేస్తూ బోర్డర్ దాటి కొంతభాగాన్ని ఆక్రమించుకుంటుంది.  వీరు రంగంలోకి దిగారు అంటే ఎంతటి లక్ష్యమైన సరే నెలకొరగాల్సిందే.  


ఈ ఐజీబీ పాక్ బోర్డర్ లో సిద్ధంగా ఉన్నారు అనే సరికి పాక్ లో గుబులు మొదలైంది.  భారత ఐజీబీల గురించి పాక్ కు బాగా తెలుసు.  అందుకే యుద్ధం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నది.  గత రెండుమూడు రోజులుగా పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన దాఖలాలు కనిపించడం లేదు.  ఒకవేళ ఏ ప్రాంతంలోనైనా కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులకు తెగబడితే.. ఐజీబీ మెరుపు దాడులు చేస్తుంది.  వారి భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.  అందుకే పాక్ భయపడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: