ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా మారిపోయాయి.  పాక్ రైల్వేశాఖ మంత్రి రషీద్ అహ్మద్ ఇండియా.. పాక్ ల మధ్య అక్టోబర్ లో యుద్ధం వస్తుందని, అణుయుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని ఇప్పటికే స్పష్టం చేసింది.  అణుయుద్ధం ఉందని చెప్పడంతో.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  


అణుయుద్ధం జరగడం అంటే మాములు విషయం కాదు.  మాములు యుద్దాలు జరిగితేనే అపారమైన నష్టం వాటిల్లుతుంది.  ఈ సమయంలో అణుయుద్ధం జరిగితే దానివలన రెండు దేశాలు దారుణంగా దెబ్బతింటాయి.  అంతేకాదు, ఈ యుద్ధం ప్రభావం ప్రపంచదేశాలపై కూడా పడుతుంది అని చెప్పడం వెనుక ఏంటో తెలియడంలేదు.  పాకిస్తాన్ తన వినాశనాన్ని కోరుకుంటోంది.  ఎలాగైనా యుద్ధం చేసి తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటోంది.  


పాక్ అధికారం ఇమ్రాన్ ఖాన్ చేతిలో ఉన్నా.. వాళ్ళను నడిపించేది ఆర్మీనే కాబట్టి, యుద్ధ కాంక్ష అనేది సహజమే.  రెండు దేశాల బోర్డర్లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  ఐజీబీ కమెండోలను ఇండియా బోర్డర్ లో ఏర్పాటు చేసింది.  ఇదిలా ఉంటె పాకిస్తాన్ లో పంజాబీలపై దాడులు జరుగుతున్నాయి.  పంజాబీ అమ్మాయిని కొంతమంది ముస్లిం యువకులు కిడ్నాప్ చేసి మతం మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు.  


దీనిపై మైనార్టీలుగా ఉన్న పంజాబీలు పాక్ లో నిరసనలు చేస్తున్నారు.  ఇటు ఇండియాలో కూడా పాక్ మైనారిటీలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఢిల్లీ పెద్ద ఎత్తున ఉద్యమించారు.  పాక్ పై ఒత్తిడి రావడంతో కిడ్నాప్ చేసిన యువతిని తిరిగి ఆ కుటుంబ సభ్యులకు అప్పగించారు.  అయితే, మైనారిటీలను బుజ్జగించేందుకు పాక్ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది.  లాహోర్ కు 90 కిలోమీటర్ల దూరంలో నాన్ కానా షాహిబ్ అనే పట్టణం ఉన్నది.  ఆ పట్టణంలో కొత్త రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నారు. 

అంతేకాదు, లాహోర్ నుంచి నాన్ కానా షాహిబ్ వరకు గురు నానక్ పేరుతో ఓ రైల్వేను నడపబోతున్నారు.  నాన్ కానా షాహిబ్ లోనే గురునానక్ జన్మించారు.  పాకిస్తాన్ కూడా శాంతిని కోరుకుంటోందని పాక్ రైల్వేశాఖ మంత్రి చెప్పడం విశేషం.  ఇండియాతో యుద్ధం తప్పదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు శాంతిని కోరుకుంటున్నామని చెప్పడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: