పవన్ కళ్యాణ్ ... అతడే ఒక సైన్యం. నలుగురి కోసం ముందుకునడుస్తూ , ముందుండి నడిపిస్తాడు. పవర్ స్టార్ కి ఉన్న క్రేజ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఏదేశమేగినా పవన్ ఫ్యాన్స్ ఉన్నారు. అయన అభిమానుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ స్టార్ కైనా కూడా సినిమాలు వరుస పరాజయాలు పాలైతే అభిమానులు తగ్గిపోతారు. కానీ , ఎన్ని పరాజయాలు ఎదురైనా కూడా రోజు రోజుకి అభిమానులని పెంచుకుంటూ పోతున్న ఏకైక  సిల్వర్ స్క్రీన్ స్టార్ మన పవర్ స్టార్. అయన నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే ..అభిమానులకి అదొక పెద్ద పండుగ. 

ఇకపోతే కోట్లాదిమంది అభిమానులు .... కోట్ల రూపాయల సంపాదన ఆయనని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నన్ను ఇంతటి స్టార్ ని చేసిన ఈ ప్రజల కోసం ఏదైనా చేసి వారి ఋణం కొద్దిగా అయినా తీర్చుకోవాలి అని ఇండస్ట్రీ లో అగ్ర హీరోగా కొనసాగుతన్న సమయంలోనే సినిమాలకి గుడ్ బై చెప్పి ... రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014 ఎన్నికలకి ముందు జనసేన పార్టీ ద్వారా ..రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ ..ఆ ఎన్నికలలో సమయం చాలా తక్కువగా ఉండటంతో పోటీ చేయలేదు. బీజేపీ ..టీడీపీ కూటమికి మద్దతు తెలిపి ..వారి గెలుపుకి తన వంతు కృషి చేసాడు.

ఇక తాజాగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికలలో పవన్ రాష్ట్రంలోని అన్ని స్థానాల నుండి పోటీ చేసాడు. తన పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసాడు. కానీ , రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జోరు ఉండటం తో జనసేన ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేయగా ... రెండు చోట్ల ఓడిపోయారు. జనసేన నుండి మొత్తంగా ఏకైక ఎమ్మెల్యే అసెంబ్లీ లోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ప్రజలలోకి వచ్చి ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. 
ఇకపోతే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ , బీజేపీ కూటమికి సపోర్ట్ చేయగా ..ఆ తరువాత జరిగిన అనూహ్యమైన మార్పులతో మూడు పార్టీలు మూడు రకాలుగా విడిపోయాయి. కానీ , లోలోపల మాత్రం టీడీపీ , జనసేన ఒకటే అని వైసీపీ నేతలు ఆరోపిస్తునే ఉన్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు.... ఈ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన బాబు పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో మాత్రం పర్యటనకి వెళ్ళలేదు, అలాగే పవన్ కూడా కుప్పం వైపు తొంగి కూడా చూడలేదు. 

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో నెట్టుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని ..అలాగే ఇదే సమయంలో బీజేపీ కూడా అప్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఈ సమయంలోనే ఆకర్ష్ బీజేపీ స్టార్ట్ చేసి ..పలువురిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వచ్చే ఎన్నికలలో టీడీపీ , బీజేపీ , జనసేన కలిసి కూడా పోటీ చేయచ్చు అని చెప్పడం తో అందరిలోనూ ఆలోచన మొదలైంది.  అలాగే అతి త్వరలో ఏపీలో బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీ గా మారబోతుంది అని బీజేపీ నేతలు చెప్తూనే ఉన్నారు.  అలాగే రాజసభలో ఉన్న నలుగురు బీజేపీ లో ఇప్పటికే చేరిన విషయం తెలిసిందే.

ఈ సమయంలోనే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం.... ఒక్క ఎమ్మెల్యే తో పార్టీ ని నెట్టుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పని కావడంతో ... పవన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అతి త్వరలోనే పవన్ తన జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకే మెగాస్టార్ ప్రజారాజ్యం స్థాపించి ...ఎన్నికల తరువాత అప్పటి పరిస్థితుల ప్రభావం తో కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసందే. ఇప్పుడు పవన్ కూడా నాటి అన్నయ్య ఫాలో అయినా విధానంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో జనసేన ని విలీనం చేసి ... మెగాస్టార్ లా మళ్ళీ సినిమాలలోకి ఎంట్రీ ఇస్తాడు అని సమాచారం. మరికొద్దిరోజుల్లోనే ఈ విషయం పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: