డబ్బుకు లోకం దాసోహం అన్న చందంగా మోటార్ రేట్ సవరణ బిల్లు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. డబ్బే పరమావధిగా జరిమానా పెంచడం ద్వారా నేల మీద నిరోధించవచ్చని భావన.  భరత్ అనే నేను సినిమా ప్రభావం ద్వారా ప్రభుత్వ పాలకులు  ఈ మోటార్ ఆక్ట్ బిల్లుకు సవరణ తెచ్చారు అనిపిస్తుంది. కానీ  చిత్తశుద్ధితో రూపొందించినట్లు లేదు. ఈ సవరణ బిల్లు వలన వాహనదారులు అందరికీ సమ న్యాయం జరగదని గంటా పథంగా చెప్పవచ్చు. 


ముఖ్యంగా మధ్యతరగతి పై పెనుభారం ఆర్థికంగా మానసికంగా దెబ్బతీసేలా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొత్తంగా రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తే 500 నుండి 1000 రూపాయలకు ప్రమాదకర డ్రైవింగ్ విషయంలో మొదటిసారి వెయ్యి రూపాయల నుండి 5000 వరకు లేదా సంవత్సరం జైలు. రెండవసారి నాలాంటి 10000 లేదా రెండు సంవత్సరాలు జైలు. అదే తాగి వాహనం నడిపిన వారి విషయంలో  మొదటిసారి పదివేల రూపాయలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు. అదే రెండవ సారి 15 వేల రూపాయల జరిమానా లేదా రెండు సంవత్సరములు జైలు. అదే  భీమా చేయని వాహనదారుడు కి మొదటి సారి 2000 గాను లేదా మూడు నెలలు జైలు. రెండోసారి అదే నేరానికి నాలుగు వేలు జరిమానా లేదా మూడు నెలలు జైలు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన నేరానికి ఒక్కసారిగా ఐదువందల నుండి 5000  రూపాయలు పెంచడం జరిగింది.


ముఖ్యంగా మనదేశంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు,  ఆదాయపు పన్ను పరిధిలోకి రాని  వారుగాను విభజిస్తే,  ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వాహనదారులు జరిమానాలను సులువుగా కట్టి వెళ్లగలరు. వీరికి డ్రైవింగ్ లైసెన్స్  లేకపోవుట గాని,  వాహనానికి భీమా  కట్టక పోవడం లాంటి సమస్యలు ఉండవు. అదే పరిధిలోకి రాని వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక,  జరిమానా   నెలసరి ఆదాయం కన్నా ఎక్కువ ఉండడం  అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది.


వీళ్ళలోనే లంచం ఇచ్చి లైసెన్స్  తెచ్చుకో లేనివారు,  సమయానికి డబ్బులు లేక బీమా చేయించుకో లేనివారు ఈ వర్గం లోనే ఉంటారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి  ప్రతి ఒక్కరికి ఒక రోజు నుండి పది రోజుల వరకు జైలు శిక్ష విధించిన ఎడల సమ న్యాయం చేయడం జరుగుతుంది. కావున ప్రభుత్వం సవరణ బిల్లును సరి చేయుటకు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాం.


మరింత సమాచారం తెలుసుకోండి: