ప్రపంచంలో అత్యంత భయానక దేశాల్లో ఆఫ్గనిస్తాన్ ఒకటి.  ఆ దేశం నిత్యం అలజడులతో అట్టుడికి పోతున్నది.  నిత్యం ఎక్కడో ఒకచోట ముష్కరులు బాంబుదాడులకు పాల్పడుతూనే ఉన్నారు.  ఎందుకు చేస్తున్నారో తెలియదు.  ఎలా చేస్తారో తెలియదు.  అలజడులు మాత్రం ఆగడం లేదు.  నరమేధానికిపాల్పడుతుంటారు .  ఇటీవలే కాబూల్ లోని ఓ పెళ్లి మండపడంలో దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడి వందమందిని పొట్టనపెట్టుకున్నారు.  ఎంతోమంది క్షతగాత్రులయ్యారు.  


ఇప్పుడు కాబూల్ లో మరో దాడి జరిగింది.  ఈ దాడిలో ఐదుమంది పౌరులు మరణించగా చాలామంది గాయపడ్డారు.  ఈ దాడికి పాల్పడింది మేమె అంటూ తాలిబన్ లు ప్రకటించారు.  ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ లు నిత్యం ఇలాంటి నరమేధాన్ని సృష్టిస్తూనే ఉన్నారు.  ఎందుకు చేస్తున్నారు.. ఆధిపత్యం కోసమా అంటే కాదు.. కావాలని ఇలా అలజడులు సృష్టిస్తూ.. నిత్యం పౌరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  


తాలిబన్ అనగానే పాక్ గుర్తుకు వస్తుంది.  పాకిస్తాన్ లోనే వీరి మూలాలు ఉన్నాయి.  తాలిబన్ అగ్రనాయకత్వం పాక్ లోనే ఉన్నది.  అక్కడి నుంచే వీరు తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు.  మొదటలో తాలిబన్ లు పాక్ లో ఉన్నారంటే అమెరికాకూడా నమ్మలేదు.  కానీ, ఎప్పుడైతే లాడెన్ ను పాక్ లో ఉన్నాడని తెలుసుకొని అక్కడ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి దాడులు చేసి చంపారో అప్పటి నుంచి పాక్ పై ఓ కన్నేసి ఉంచింది అమెరికా.  


పాక్ ప్రధాని ఇమ్రాన్ కూడా తమ దేశంలో 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఇప్పటికే ఒప్పుకున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేరు.  ఎందుకంటే పైకి అధికారాలు ప్రధానికి ఉన్నట్టుగా ఉన్నా.. అసలు అధికారం అంతా సైన్యం చేతుల్లో ఉంటుంది. ఐఎస్ఐ చేతుల్లో ఉంటుంది.  వారిని కాదని ప్రధాని ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు.  సో, రాష్ట్రపతి ఎలా రబ్బరు బొమ్మలా వ్యవహరిస్తారో.. పాక్ లో ప్రధాని పరిస్థితికూడా అంతే అన్నమాట.  ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంత కాలం పాక్ పరిస్థితి ఇలానే ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: