ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కనీస ఇంగితజ్ఞానం లేదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం జలాలు సముద్రము పాలే అయ్యాని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  సాంకేతిక విషయంలో కూడా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చివరికి ఇంజనీర్ వ్యవస్థను,నిపుణులను చేసిన సిఫార్సులను తుంగలోతొక్కారని అన్నారు. తనకు తానుగా 2015 నవంబర్ వరకు ఒకమాట 2016 నుండి మరోమాట మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్లను కాళేశ్వరంగా మార్చారన్నారు. ఆ విధంగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టులో మిడ్'మానేరుకు నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో కూడా తెలియని అయోమస్థితిలో ఉన్నారని విమర్శించారు. గోదావరి జలాలను ఎత్తైన తెలంగాణ బీడు భూముల్లో సరఫరా చేసి శాశ్వత ప్రాతిపదికన రైతులను ఆదుకోవడానికి తలపెట్టిన ప్రాజెక్టులు ఎల్లంపల్లి-మిడ్'మానేరు అని గుర్తు చేశారు.







ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద గాని మిడ్'మానేరు పరిధిలో గోదావరి నీళ్లను వాడుకునే వ్యవస్థ ఈరోజు వరకు పూర్తి చేయలేదన్నారు  దానివల్లనే మిడ్'మానేరు గేట్లు తెరచి తిరిగి లోయర్ మానేరు డ్యాంకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.  లోయర్ మానేరు డ్యాంకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే తక్కువ ఎత్తులో ఉన్న కాకతీయ కాలువ ద్వారా ఇస్తే లోయర్ మానేరు డ్యాం వరకున్న ఆయకట్టుతో సహా లోయర్ మానేరు డ్యాం నింపే అవకాశం ఉంది. ఆ విషాయాన్ని పక్కనపెట్టి ముప్పై మీటర్ల ఎక్కువ ఎత్తున్న మిడ్'మానేరు గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యాం నింపడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. ఈరోజు మిడ్'మానేరు గేట్లను మొట్టమొదటిసారిగా ఎత్తి నీళ్లను లోయర్ మానేరు డ్యాంకు వదిలి పెట్టారు. ఈ మిడ్'మానేరుకు నీళ్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఎలా వాడుకోవాలి? అన్న అంశాలపై చర్చించాలన్నారు. నలభైఅయిదు వేల కోట్లతోని కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల ఆఘమేఘాల మీద నిర్మాణం చేసి కాళేశ్వరం అయిపోయింది అంటున్నారని ఆరోపించారు. 






ఎల్లంపల్లి పూర్తిచేసి అయిదేళ్లు అయినా ప్రారంభించ లేదన్నారు. ఇందులో ఇరవై టీఎంసీల నీళ్లు నిలువ ఉండటమే కాకుండా 108 టీఎంసీల నీళ్లు కిందికి పోయాయన్న నగ్నసత్యాన్ని వీక్షకులకు,నిపుణులకు, ఇంజనీర్లకు గుర్తు చేశారు. మొదటగా ఎల్లంపల్లి దగ్గర గోదావరి నీళ్లను వాడుకునే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో కొనసాగిన పనులను పక్కనపెట్టి ఆదరబాదరగా అప్పు తీసుకుని కింద మూడు బ్యారేజిలతో  కాళేశ్వరంను  పూర్తి చేశారని విమర్శించారు. కాళేశ్వరం జలాలు సముద్రము పాలే అయినాయి కదా అని నిలదీశారు. ఎల్లంపల్లి నుండి మిడ్'మానేరు వరకు నీళ్లు కాకతీయ కాలువదాటి ఎక్కువ ఎత్తులో ఉన్న (30 మీటర్లు) వరదకాలువ ద్వారా మిడ్'మానేరుకు వస్తున్నాయని చెప్పారు. అదనంగా ముప్పై మీటర్లు తేవడం కంటే కాకతీయ కెనాల్ లో వేయడం మంచిదనే ఇంగితజ్ఞానం వీరికి లేదని పొన్నాల మండిపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: