కయ్యానికి కాలు దువ్వడంలో పాక్ చాలా ముందుంటుంది. అందునా  దాయాది భారత్ అంటే ఎందుకో తీరని పగతో రగిలిపోతుంది. పాక్ ది ఎపుడూ సమర నినాదమే. కోరి అఖండ భారత్ నుంచి విడిపోయినా ఈ డెబ్బయ్యేళ్ళలో ఓ దేశంగా మారి పాక్ సుఖపడింది లేదు, భారత్ ని సుఖపెట్టింది లేదు, ఈ నేపధ్యంలో ఇప్పటికి నాలుగు యుధ్ధాల్లో భారత్ పాక్ ని చావు దెబ్బ తీసింది.


అయినా సరె పాక్ బుద్ధి మారడంలేదు. తాను బలమైన దేశం అనుకుంటోంది. భారత్ మీద చిన్న చూపు చూస్తూ మరోసారి చావు దెబ్బ తినాలని ఉవ్విళ్ళూరుతోంది. భారత్ తనకు రావణ కాష్టంగా ఉన్న కాశ్మీర్ సమస్యను  రాజ్యాంగం ప్రకారం ఉన్న హక్కుల ప్రకారం పరిష్కరించుకుంది. ఈ విషయంలో పాక్ తో సహా మరే దేశమూ వేలెత్తి చూపడానికి లేనే లేదు. కానీ పాక్ వైఖరి మాత్రం అలా లేదు. తనకేదో దెబ్బ పడినట్లుగా గత నెల రోజులుగా అల్లల్లాడిపోతోంది.


దాంతో యుధ్ధం అంటూ ఉన్మాదిగా మారి వికటాట్టహాసం చేస్తోంది. యుధ్ధం మరో రెండు నెలలల్లో వస్తుంది అని పాక్ మంత్రులు, పెద్దలు అంటున్నారంటే ఆ దేశం పైత్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి. ఇదిలా ఉండగా పాక్ తాజాగా కార్గిల్ కి అతి సమీపంలో బంకర్లను నిర్మిస్తున్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి.


మరీ ముఖ్యంగా ఏల్వోసీకి దగ్గరలో ఈ నిర్మాణాలు జరుగుతూండడం ఆందోళన కలిగించే విషయమే. బంకర్లను పాక్  కమాండ్ పోస్టులుగా లేదా పేలుడు పదార్ధాలు నిలువ ఉంచేందుకు వినియోగించుకు  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటు సర్క కిక్ ప్రాంతంలో మిలటరీ బిల్డప్ ని పాక్ ఏర్పాటు చేస్తోంది. మొత్తానికి చాప కింద నీరులా పాక్ యుధ్ధానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. భారత్ కూడా రెడీగా ఉన్నా దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: