మనిషిగా పుట్టాక ఎన్ని కష్టాలైన ఎదురీది ఒడ్డుకు చేరాలని చెబుతారు.కాని కాలం పెట్టే కష్టాలు ఒక్కోసారి ఎంతగా ఏడిపిస్తాయం టే ఎందుకు ఇంకా బ్రతికున్నామా అనేలా,ఇలాంటి ఘోరం చూడడానికా అని రోదించేలాచేస్తాయి.ఒక మనసుకి ఏరూపంలో వున్న తనబిడ్డ అంటే ఎంతో ప్రేమవుంటుంది.అది మూగజీవాలైన కావచ్చూ.ఒకరకంగా ఇప్పుడున్న రోజుల్లో మూగజీవులకున్న ప్రేమలు మనషులకు లేవు.కాని అక్కడక్కడ అప్పుడప్పుడు కనిపిస్తాయి మనుషులమధ్య ఇలాంటి బంధాలు..ఒకవైపు దిక్కుతో చని స్దితి,మరోవైపు పేదరికం ఈ రెండుకలసి ఆ తండ్రిలోని జీవాన్ని పీక్కుతిన్నాయి..వివరాల్లోకి వెళ్లితే.



కరీంనగర్ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన దారుణ సంఘటన మన వ్యవస్ధలోని లోపాలను ఎత్తిచూపుతుంది.కాల్వశ్రీరాంపూర్ మండలం కునారానికి చెందిన సంపత్‌,కూతురు,తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చనిపోయింది.కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బుల్లేవని ప్రభుత్వ అంబులెన్స్‌ పంపాలని సంపత్ ఆస్పత్రి అధికారుల ను కోరాడు.అయితే అంబులెన్స్‌ పనిచేయడం లేదని అధికారులు సమాధానమిచ్చారు.అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో చేసేదేమి లేక తండ్రి సంపత్ కూతురు మృతదేహాన్ని చేతులపై మోసుకెళ్లాడు.ఒకవైపు తన కూతురి మృతదేహంతో,ఇక తన కూతురు కనబడ దని,తిరిగిరాని అనంతలోకాలకు వెళ్లిపోయిందని కళ్లనీళ్లు పెట్టుకుంటు శవాన్ని చూస్తూ రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలిచి వేసింది.



ముసుగేసుకున్న మృగాలమధ్య ఏ కూతురుకు ఇలాంటి దుస్దితి రాకూడదని విలపిస్తున్నాడు ఆ తండ్రి.ఇక ఈ సంఘటన చూసిన స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,వెంటనే ఆస్పత్రి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇక ఈ సంఘటనపై అధికారులు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..ఏది ఏమైన పేదలకోసమే నాయకులున్నారని చెప్పేవారు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో.అంతేకాదు ఈ దారుణం జరిగింది ఎక్కడో మారుమూలా ప్రాంతంలో కాదు అభివృద్ది చెందిన పట్టణ నడిబొడ్డులో జరిగింది.ఇక కరీంనగర్‌లో అధికార పార్టీ నాయకులు ఎందరో వున్నారు వారి కంటికి ఇలాంటి సమస్యలు కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తు న్నారు.తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: