పాకిస్తాన్ తన దేశంలో ఉండే మైనారిటీల విషయం గురించి పట్టించుకోకుండా.. ఇండియాలో ఉండే కాశ్మీర్ ప్రజల కోసం ఆరాటపడుతుంది.  కారణం ఏంటి అంటే.. కాశ్మీర్ ను ఆక్రమించుకుంటే..అక్కడి వనరులను దక్కించుకోవచ్చు.  హిమాలయాల నుంచి వచ్చే నీటిని మళ్లించి పాక్ ను సస్యశ్యామలం చేసుకోవచ్చు.  అంతకు మించి చైనాకు దగ్గర కావొచ్చు.  చైనాకు దగ్గరైతే.. దోస్తీ పెంచుకొని అవసరమైతే కాశ్మీర్ ను కూడా చైనాకు అప్పగించి తన బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు అన్నది పాక్ కుయుక్తి. 


ఇవన్నీ ముందుగా ఊహించే జమ్మూ కాశ్మీరు విషయంలో అమలులో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది.  జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి అధికారాలను కేంద్రం ఆధీనంలో పెట్టుకుంది.  అది తాత్కాలికమే అని చెప్పింది.  ప్రస్తుతం కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి.  త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అనడంలో సందేహం లేదు.  అయితే, కాశ్మీర్ ను అడ్డం పెట్టుకొని అక్కడ మైనారిటీల విషయంలో పాక్ నరకం చూపిస్తున్నది.  


పంజాబ్ ప్రావిన్స్ లో ఉంటున్న పంజాబీలను పాక్ నరకం చూపిస్తున్నది. అక్కడి ఆడపిల్లలను ఎత్తుకుపోయి బలవంతగా మతం మార్చి వివాహం చేసుకుంటున్నారు.  ఇలా మతం మార్చి వివాహం చేసుకుంటూ నరకం చూపిస్తున్నారు.  ఈ విషయంలో అక్కడి మైనారిటీలుగా ఉంటున్న హిందువులు పెద్ద ఎత్తున లాహోర్ లో ఆందోళన చేశారు.  కానీ పాక్ మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు అన్నది వాస్తవం.  


నెలరోజుల్లో ముగ్గురు అమ్మాయిలను కిడ్నాప్ చేసి మతం మార్చి బలవంతంగా వివాహం చేసుకుంటున్నారు అక్కడి ముస్లిం యువత.  స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళను అరెస్ట్ చేసి వదిలేస్తున్నారు.  రాజకీయ పార్టీల అండదండలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.  ఇకపోతే, ఈ విషయాన్నీ బయటకు రాకుండా చూడటానికి అక్కడి ప్రజలను రెచ్చగొట్టి లాహోర్ లో కాశ్మీర్ కు అనుకూలంగా నినాదాలు చేయిస్తున్నారు.  వందలాది మంది లాహోర్ లో కాశ్మీర్ అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.  ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: