ప్రభుత్వదావఖానాలను ...కార్పొరేట్ హాస్పిటళ్ళకు ధీటుగా ఉండేలా మారుస్తాం .కార్పొరేట్ హాస్పిటళ్ళకి మించిన వైద్యం అందిస్తాం...అంతకు మించిన సౌలబ్యాలు కలిపిస్తాం . పేదోడికి హాస్పిటల్లో చిన్ని కష్టం కూడా రాకుండా చూస్తాం ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఇస్తామంటూ నాయకులూ ఇస్తున్న హామీలు . హామీలు హామీలు గానే ఉంది పోతున్నాయి తప్ప ...క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు బిన్నంగా ఉంది . ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్షానికి  నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో సంఘటనలు జరగ్గా ... ఇప్పుడు తాజాగా  ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది .


పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్ కుమార్...  తన ఏడేళ్ల కూతురు  కోమలత  కిడ్నీ సమస్యతో బాధపడుతుండటంతో ...కరీనగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు .రెండు రోజుల  క్రితం పరిస్థితి విషమించి హేమలత చికిత్స పొందుతూ చనిపోయింది .అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు చనిపోవటం తో సంపత్ కుమార్ శోకసంద్రంలో మునిగి పోయాడు. ఆసుపత్రి సిబ్బంది తన్న కూతురు శవాన్ని స్ట్రెచర్ పై తీసుకొచ్చి ఆసుపత్రి ఎంట్రెన్స్ గేట్ దగ్గర ఉంచారు. చేతులో డబ్బులు లేకపోవటం తో ఆసుపత్రి అంబులెన్స్ కావాలని కోరాడు సంపత్ కుమార్.


కానీ మానవతావాన్ని మరిచిన ఆసుపత్రి అధికారులు అంబులెన్స్ పంపడానికి   నిరాకరించారు . దీంతో చేసేది ఏమి లేక తన కూతురు శవాన్ని చేతిలో పట్టుకొని గుండెలు బద్దలయ్యేలా ఏడుస్తూనే మోసుకుంటూ వెళ్ళాడు . బయటకివెళ్ళాక ఏ వాహనం కూడా తన కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు .దీంతో ఓ ఆటో డ్రైవర్ కాళ్ళ వేళ్ళ పడితే చివరకు కోమలత శవాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించటం తో...చివరకు తన కూతురు శవాన్ని ఇంటికి తీసుకెళ్లాడు . ఈ ఘటన ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుంది .


ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం ... కార్పొరేట్ హాస్పిటళ్ళకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నాం అంటూ గొప్పలు చెప్పుకునే నాయకుడు ఈ హృదయ విదారక ఘటనకు ఏం సమాధానం చెప్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీరు తీసుకొస్తాం అంటున్న బంగారు తెలంగాణా  అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఘటనకు భాద్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు  




మరింత సమాచారం తెలుసుకోండి: