ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాలలో సామాన్యులకు అంత తేలికగా అర్థం కావు. గడచిన కొన్ని రోజులుగా భారదేశ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి వార్తల్లో వినటం తప్ప సామాన్యులకు ఈ లెక్కలు అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ మధ్య ఉన్న తేడాను చూస్తే మోడీ ప్రభుత్వం చేస్తున్న మేజిక్ అర్థమవుతుంది. 
 
ప్రస్తుతం దేశ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉన్నవి పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్. గ్యాస్ కంటే పెట్రోల్, డీజిల్ వినియోగించే వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో పెట్రోల్ ధరతో పోలిస్తే డీజిల్ ధర చాలా తక్కువగా ఉండేది. 2011, 2012 సంవత్సరాల్లో పెట్రోల్, డీజిల్ మధ్య వ్యత్యాసం 20 రుపాయల కంటే ఎక్కువగా ఉండేది. డీజిల్ ధర తక్కువగా ఉండటంతో గతంలో డీజిల్ వాహనాల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. 
 
కానీ మోడీ ప్రభుత్వం పరిపాలనలో పెట్రోల్, డీజిల్ మధ్య వ్యత్యాసం భారీగా తగ్గింది. గతంలో పెట్రోల్, డీజిల్ మధ్య వ్యత్యాసం 20 రుపాయలు ఉండగా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మధ్య కేవలం 6 రుపాయల వ్యత్యాసం మాత్రమే ఉంది. మోడీ ప్రభుత్వంలో పెట్రోల్, డీజిల్ మధ్య వ్యత్యాసం ఇంత భారీగా తగ్గిందంటే ప్రజల మీద ఎంత భారం పెరిగిందో తేలికగానే అర్థమవుతుంది. 
 
పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం తగ్గటంతో డీజిల్ వాహనాల విక్రయాలు కూడా భారీగా తగ్గాయని తెలుస్తోంది. డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పడుతూ ఉండటంతో డీలర్లు కూడా డీజిల్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపట్లేదు. 2018 ఆర్థిక సంవత్సరంలో డీజిల్ కార్ల వాటా 53 శాతం నుండి 40 శాతానికి తగ్గిందంటే డీజిల్ వాహనాల విక్రయం ఎంత భారీగా తగ్గిందో అర్థమవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: