అధికార వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారంటూ రెండు మూడు రోజులుగా ఒకటే ప్రచారం జరుగుతోంది. హై కోర్టు ఏర్పాటు చేయటమంటే మామూలు విషయం కాదు కదా ? అందులోను జ్యుడిషియరీ అంటే మామూలు జనాలకు ఓ పట్టాన అర్ధంకాని బ్రహ్మ పదార్ధమైపోయింది. అందుకనే న్యాయస్ధానాల జోలికి ఎవరూ వెళ్ళరు అంత తొందరగా.

 

అలాంటిది ఇపుడు కర్నూలులో హై కోర్టు ఏర్పాటు గురించే సామన్య జనం మాట్లాడేస్తున్నారంటే అర్ధమేంటి ?  అసలు హై కోర్టు ఏర్పాటుకు తగిన వసతులు ఉన్నాయా అన్నదే అసలు సమస్య. అదే విషయాన్ని వాకాబు చేస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

 

అవేమిటంటే నిజంగానే హై కోర్టును కర్నూలుకు తరలిస్తే అందుకు అవసమైన అన్నీ వసతులు  ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న జిల్లా కోర్టు భవనాలు బ్రిటిష్ హయాంలో నిర్మించినదట.  ఎప్పుడో వందేళ్ళ క్రితం నిర్మించినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా బ్రహ్మాండంగా ఉన్నాయట. తాత్కాలికంగా హైకోర్టు నిర్వహించటానికి ఈ భవనాలు సరిపోతాయట.

 

అలాగే ఉద్యోగుల కోసం ఎప్పుడో నిర్మించిన క్వార్టర్స్ కూడా 100 దాకా ఉన్నాయట. కాకపోతే వాటిల్లో ఉండకపోవటంతో కొన్నింటి మెయిన్ టెనెన్స్ బాగాలేదట. జిల్లా జడ్జి కూడా ఈ క్వార్టర్స్ లోనే ఒకదానిలో  ఉంటున్నారట. అలాగే పోలీసు బెటాలియన్ కోసం 100 ఎకరాల స్ధలం ఉందట. దాన్ని బయటప్రాంతానికి తరలించే యోచనలో పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. అందులో కూడా కొన్ని భారీ నిర్మాణాలున్నాయట.


సరే క్వార్టర్స్ అయినా పోలీసు బెటాలియన్ స్ధలంలో నిర్మాణాలైనా, జిల్లా కోర్టు భవనాలైనా కాస్త ఖర్చు పెట్టుని షోకులు దిద్దితే బ్రహ్మండంగా ఉంటయానటంలో సందేహం లేదు. మహా అయితే ఓ రూ. 20 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండంగా రెడీ అవుతాయని సమాచారం. హై కోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే చాలు. అనుకున్న దగ్గర నుండి ఓ ఆరుమాసాలు సమయం తీసుకుంటే హై కోర్టు ఏర్పాటుకు అవసరమైన అన్నీ హంగులు రెడీ అపోయితుంది. రాయలసీమ ప్రజల కోరికా తీరుతుంది. రాజధానిపై ఒత్తిడీ తగ్గుతుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: