టీఆర్ఎస్ లో మాజీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న చోట తమకు ప్రాధాన్యత లేదని ఫిర్యాదులు వస్తున్న తరుణంలో.. నియోజక వర్గ ఇంఛార్జులకు కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. పార్టీ సమావేశాలు అన్నింటికీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను విధిగా పిలవాలని టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. 
సభ్యత్వ నమోదును పూర్తి చేసుకున్న టిఆర్ఎస్ .... వివిద స్థాయిల్లో కమీటీల ఏర్పాటులో ఉంది. అదే సమయంలో పార్టీలో అన్ని స్థాయిల నేతలు కలిసి ముందుకు వెళ్లేలా చూస్తోంది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా సమావేశాలకు ఆహ్వనించాల్సిందిగా టీఆర్ఎస్ నేతలకు సూచించింది. నియెజకవర్గ స్థాయిల్లో జరిగే సమావేశాలకు వీరిని కచ్చితంగా ఆహ్వానించాల్సిందిగా పార్టీ స్పష్టం చేసింది.

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా నియెజకవర్గాల్లో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ సమావేశాలకు కచ్చితంగా వారిని కూడా పిలవాలని పార్టీ సూచించింది. అన్ని నియెజకవర్గాల్లో ఫాలో అయ్యేలా చూడాలని పార్టీ నియెజకవర్గ ఇంఛార్జ్ లకు టీఆర్ఎస్ స్పష్టం చేసింది.
 
ఆయా నియెజకవర్గాల్లో గతంలో ప్రాతినిధ్యం వహించిన వారిలో కొందరు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. డోర్నకల్ నియెజకవర్గంకు ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న సత్యవతి రాథోడ్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆ నియెజకవర్గంకు ఎమ్మెల్యేగా రెడ్యా నాయక్ ఉన్నారు. నియెజకవర్గంలో జరిగే పార్టీ సమావేశాలకు తనను ఆహ్వనించడం లేదని అధినాయకత్వం దృష్టికి సత్యవతి రాధోడ్ తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పార్టీ అధినాయకత్వం భవిష్యత్ లో ఇలాంటివి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉండడంతో నేతల మధ్య కమ్యునికేషన్ గ్యాప్ లేకుండా ఉండేలా చర్యలు తీసుకోంటోంది టీఆర్ఎస్ అధిష్టానం. పార్టీలో మాజీలకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అభిప్రాయం రాకుండా టిఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీకి ఇబ్బంది కల్గించకుండా కలిసి ముందుకు సాగాలని నేతలకు స్పష్టం చేస్తోంది టిఆర్ఎస్.


మరింత సమాచారం తెలుసుకోండి: