సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చింది.  ఈ వాహన చట్టం ప్రకారం కొత్త చలానా విధానం అమలులోకి తీసుకొచ్చారు.  ఇప్పటి వరకు వాహనాలను ఇష్టం వచ్చినట్టుగా నడుపుతున్నారు.  కానీ కొత్త చట్టం ప్రకారం నిబంధనలు అతిక్రమిస్తే.. వేలకువేలు చలానా కట్టాల్సిందే.  ఇంతకు ముందు హెల్మెట్ పెట్టుకోకపోతే వంద, సిగ్నల్ క్రాస్ అయితే మరో వంద ఇలా చలానాలు ఉండేవి.  చలానా తక్కువే కావడంతో పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు.  


ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు.  చట్టాలను కఠినతరం చేస్తే.. దారిలోకి వస్తారని భావించిన ప్రభుత్వం.. చట్టాలను కఠినతరం చేసింది.  రూల్స్ ను అతిక్రమిస్తే.. భారీగా ఫైన్ వేస్తున్నారు.  దక్షిణాది రాష్ట్రాల్లో ఈ చట్టం అమలులో ఉన్నా.. పెద్దగా పట్టించుకోవడమలేదు.  ఉత్తరాది రాష్ట్రాల్లో వీటిని పక్కాగా అమలు చేస్తున్నారు.  హర్యానాలో గురుగ్రామ్ జిల్లాలోని జిల్లా కోర్టుకు ఎదురుగా పోలీసులు ట్రాఫిక్స్ చెకింగ్ చేస్తున్నారు.  


అదే సమయంలో అటుగా వస్తున్న వాహనదారుడిని పట్టుకున్నారు.  లైసెన్స్ లేదు, పొల్యూషన్ చెకప్ సర్టిఫికెట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు.. పైగా హెల్మెట్ పెట్టుకోలేదు.  ఇవన్నీ లేకపోవడంతో.. సదరు వ్యక్తికీ ట్రాఫిల్ పోలీసులు ఏకంగా రూ. 23 వేలరూపాయల ఫైన్ వేశారు.  ఈ ఫైన్ ను చూసి పాపం ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.  బైక్ అమ్మినా అంత మొత్తంలో రాదనీ, బైక్ కు చలానా కట్టాలా లేదంటే బైక్ వదిలేసి వెళ్లాలో అర్ధం కాలేదట.  


దేశంలో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత.. రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లు అయ్యాయి.  ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని  ప్రయాణం చేస్తున్నారు.  లైన్ దాటడం లేదు.  చాలా వరకు కంట్రోల్ లోకి వచ్చింది.  చట్టాలను కఠినంగా అమలు చేస్తే.. ప్రతి ఒక్కరు తప్పకుండా ఫాలో అవుతారని రెండు రోజుల్లోనే తేలిపోయింది. మరి ఇంతకాలం ఎందుకు ఉపేక్షించినట్టు అంటే కేవలం రాజకీయం కోసమే.. ఓటు కోసమే.  కానీ, ఇప్పుడు ప్రజలు సంపూర్ణ మెజారిటీ ఇవ్వడంతో ప్రభుత్వం చట్టాలను కఠినం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: