ఇటీవల ఆమోదించిన కొత్త మోటారు వాహనాల (సవరణ) బిల్లు కు మన్న సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలు లో‌కి వచ్చాయి. వచ్చిన రెండో రోజే నెట్టింట ఒక న్యూస్ వైరల్ అయ్యింది. ఢిల్లీ నివాసి అయిన దినేష్ మదన్ కు అనేక నిబంధనలను ఉల్లంఘించినందుకు గురుగ్రామ్ పోలీసులు రూ .23,000 విలువైన జరిమానా విధించారు.


చలాన్ రశీదు ప్రకారం, తాను ఉల్లంగించిన  నిబంధనలు:
1. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
2. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా డ్రైవింగ్
3. థర్డ్ పార్టీ బీమా లేకుండా డ్రైవింగ్
4. వాయు కాలుష్యాన్ని ఉల్లంఘించడం
5. హెల్మెట్ లేదా తలపాగా లేకుండా బండి నడపడం

"నేను నాకు విధించిన ఫైన్ ను చూసి చాలా షాక్ అయ్యాను , ఎందుకంటే ఇది చిన్న మొత్తం కాదు, నాకు అది  చాలా పెద్దది. నేను నా బండి కి సంభందించిన పత్రాలను తీసుకెళ్లడం మరచిపోయాను. నేను పోలీసులకు పత్రాలు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పాను, అవి 10 నిమిషాల్లో తీసుకురావాలని వారు నన్ను కోరారు. కానీ నేను ఢిల్లీ లో‌ ఉంటాను, మేము గురుగ్రామ్ కోర్టు సమీపంలో ఉన్నానని అంత తక్కువ సమయం‌లో‌ నేను వాటిని తీసుకురాలేనని తెలిపాను. అప్పుడు వారు నా బండి తాళాలని అడిగి తిసుకున్నారని ”  మదన్ తెలిపాడు,

కొత్త బిల్లు సెప్టెంబర్ 1, 2019 నుండి వర్తిస్తుంది, ట్రాఫిక్ ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలను విధిస్తోంది. ఈ చట్టం గతంలో 2017 లో ప్రవేశపెట్టబడింది కాని రాజ్యసభను ఆమోదించలేకపోయింది. 2019 బిల్లును ఉభయ సభల్లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రవేశపెట్టారు. రహదారి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలను అమలు చేయాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: