తాను ప్రారంభించ‌నున్న ప‌థ‌కాల్లో కీల‌క‌మైన నాణ్య‌మైన బియ్యం, కంటివెలుగు వంటి ప‌థ‌కాల‌ను ఉత్త‌రాంధ్ర నుంచే ప్రారంభించాల ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ముఖ్యంగా శ్రీకాకుళం కిడ్నీ బాధితుల‌కు సూప‌ర్ స్పెషాలిటీ నిర్మించేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. అదేస‌మ‌యంలో కిడ్నీ రోగుల‌కు పింఛ‌న్ మొత్తాన్ని ఏకంగా 3000 నుంచి 10 వేల‌కు పెంచారు. ఈ నేప‌థ్యంలో అస‌లు జ‌గ‌న్ ఎందుకు ఇంత‌గా ఉత్త‌రాంధ్ర‌పై ఆలోచ‌న చేస్తున్నారు. త‌న దృష్టిని ఎందుకు ఇంత‌గా అక్క‌డే కేంద్రీక‌రించారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. 


ఒక్క‌సారి ఎన్నిక‌ల‌కు ముందు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ఆరాతీస్తే.. శ్రీకాకుళంలో తిత్లీ తుఫాన్ హోరెత్తించింది. అక్క‌డ‌కు స‌మీపంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్నారు. అయితే, ఆయ‌న క‌నీసం అక్క‌డి ప్ర‌జ‌ల‌ను, తుఫాను బాధితుల‌ను ప‌ట్టించుకోలేద‌ని సాక్షాత్తూ.. అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు స‌హా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా తీవ్రంగా విమ‌ర్శించారు. ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రూ కూడా దీనినే ఆయుధంగా చేసుకుని ప్ర‌చారం చేశారు. ప‌వ‌న్ అయితే, ఎన్నిక‌ల‌కు ముందు తాను ప్రారంభించిన యాత్ర‌ను కూడా శ్రీకాకుళం నుంచి మొద‌లు పెట్టారు. 


ఇక‌, చంద్ర‌బాబు తుఫాన్ స‌మ‌యంలో అక్క‌డే పాగావేసి మ‌రీ బాధితుల‌కు భ‌రోసా ఇచ్చారు. నిధులు మంజూరు చేశారు. క‌ట్ చేస్తే.. శ్రీకాకుళం ఎంపీ స‌హా టెక్క‌లి త‌ప్ప టీడీపీ ద‌క్కించుకున్న స్థానాలు ఏమీ లేవు. ఇక‌, జ‌న‌సేనాని ఒక్క‌టంటే ఒక్క సీట్లోనూ విజ‌యం సాధించ‌లేక పోయారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. తుఫాన్ బాధితుల‌ను ఆదుకోలేద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు మాత్రం ఈ విష‌యా న్ని లైట్ తీసుకున్నారు. దీంతో ఇక్క‌డ వైసీపీ విజృంభించింది. 


ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లు త‌న‌పై చూపించిన అభిమానానికి ఫిదా అయిన జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌తి కార్య‌క్ర‌మాన్నీ అక్క‌డి నుంచే ప్రారంభించాల‌ని అనుకున్నారా?  లేక ఉత్త‌రాంధ్ర‌లో తిష్ట‌వేయాల‌ని అనుకున్న ప‌వ‌న్‌కు చెక్ పెట్టాల‌ని భావించారో.. లేక ఇప్ప‌టికే పు నాదులు బ‌లంగా ఉన్న టీడీపీని కూక‌టి వేళ్ల‌తో పెక‌లించాల‌ని వ్యూహం ప‌న్నారో ప్ర‌స్తుతానికి తెలియ‌దు కానీ, జ‌గ‌న్ దృష్టి మాత్రం ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. 


తాజాగా ఈ నెల నుంచి ప్రారంభిస్తున్న నాణ్య‌మైన బియ్యంపంపీణీని త్వ‌ర‌లోనే శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని కూడాఇక్క‌డ నుంచే ప్రారంభిస్తున్నారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు జ‌గ‌న్ ఇక్క‌డ నుంచే శ్రీకారం చుడ‌తార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ వైసీపీ పుంజుకుంటుందా?  లేదా?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: